1992లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ “ఘరానా మొగుడు” షూటింగ్ సమయంలో తన నడుంపై గిల్లేసిన ఒక వ్యక్తిని చితక్కొట్టేశానని, దివంగత హీరో శ్రీహరి భార్య డ్యాన్సర్ డిస్కోశాంతి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వైజాగ్ లోని హార్బర్ లో ‘బంగారు కోడి పెట్ట… వచ్చెనండి…’ అనే పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో షాట్ రెడీ అనగానే…
చిరంజీవి గారు రాగానే అక్కడ ఉన్న వాళ్లు చప్పట్లు కొట్టేశారు. నేను ఆరెంజ్ కలర్ స్కర్ట్ వేసుకుని ఉన్నాను. ఆ షాట్ అయిపోగానే పైన ఓ క్లాత్ కప్పుకుని నడిచి వెళుతుంటే… సుమారు పదిహేను మంది ఉన్న ఓ గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లలో ఒకడు నా నడుంపై గిల్లాడు. అంతే వాడి చెయ్యి పట్టుకుని ముందుకు లాగి చితక్కొట్టుడు కొట్టాను… కింద పడేసి కాళ్లతో తొక్కి పారేశాను.
ఇది చూసి చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు షాకయ్యారు. వెంటనే వాళ్లు వచ్చి, చెరో వైపు నన్ను పట్టుకుని తీసుకు వెళ్లిపోయారు అంటూ నాటి సంఘటనను దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాలా..? రీమిక్స్ చేసిన సమయంలోనూ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన పాటగా టాలీవుడ్ లో ఆ పాటకు ప్రత్యేక స్థానం ఉంది.



