సాధారణంగా, ప్రజలంతా ఇంట్లో పిండి వంటలతో, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సీజన్ ను గడుపుతారు. మన తెలుగు వారు కూడా ఇదే పని చేస్తున్నప్పటికీ, మన వారికి పండగ రోజు సినిమా చూడనిదే, ఆ పండగ వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అయితే, దగ్గరలో ఉన్న పెద్ద పండుగ ‘దీపావళి’ తెలుగు ప్రేక్షకుల ముందుకు నాలుగు చిత్రాలను తీసుకురానుంది.
ఇందులో లక్కీ భాస్కర్’, ‘క’…రెండు చిత్రాలు స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే, ‘అమరన్’, ‘బఘీర’…రెండు సినిమాలు మాత్రం డబ్బింగ్ చిత్రాలు. ఈ నాలుగు సినిమాలూ అక్టోబర్ 31 నే విడుదల కావల్సి ఉండగా, అమావాస్య కారణంగా 30 వ తేదీ నుండే రెండు సినిమాలు ప్రీమియర్స్ రూపంలో అభిమానుల ముందుకు వ చ్చేస్తున్నాయి అంటూ చిత్ర యూనిట్ తెలియచేసింది.
‘సీత రామం’ హీరో దుల్కర్, తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కలయికతో రానున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఈ దీవాళీ రేసులో ముందంజలో ఉంది. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచింది. తొలిప్రేమ,
సార్, మిస్టర్.మజ్ను,రంగ్ దే వంటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చే డైరెక్టర్, ఈసారి కాస్త రూటు మార్చి ఒక సాధారణ బ్యాంకు ఎంప్లాయ్ కోటీశ్వరుడిగా ఎలా మారాడు..? మారాక, తన వ్యక్తిగత జీవితం లో డబ్బు తెచ్చిన మార్పులేంటి అనే కమర్షిల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇక, పబ్లిసిటీ ప్రకారం, రెండవ సినిమా కిరణ్ అబ్బవరం “క”.! ‘జాతర పాట’, చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ వలన సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీనికి తోడు సినిమా ప్రమోషనలలో హీరో కిరణ్ అబ్బవరం ప్రెస్ తో మాట్లాడిన మాటలు సినిమా ప్రమోషన్ కు బాగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి.
మూడవ సినిమా గా, పరిచయం అవసార్లేని పేరు ‘సాయి పల్లవి’ మరియు శివ కార్తికేయన్ లీడ్ రోల్స్ గా నటించిన ‘అమరన్’. ఉగ్ర దాడిలో అమరులైన మేజర్.ముకుంద్ వరదరాజన్ జీవిత ఆధారంగా వస్తున్న సినిమా కావటంతో, వాస్తవ సంఘటనలు,నిజ జీవిత కథలతో వచ్చే సినిమాలకు ఎప్పుడు ప్రజాధారణ ఉండటంతో, ఈ సినిమా పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇక చివరిగా, కె.జీ.ఎఫ్, సలార్ వంటి పాన్-ఇండియా హిట్స్ ఇచ్చిన దర్శకుడు ‘ప్రశాంత్ నీల్’ అందించిన కథతో తెరకెక్కిన ‘బఘీర’…శ్రీమురళి, రుక్మిణి వసంత్ లీడ్ యాక్టర్స్ గా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అనే ఒక్క అంశమే ప్రమోషనల్ కంటెంట్. విడుదల చేసిన ట్రైలర్ సోసో గానే ఉండటం తో, మిగతా సినిమాలతో పోల్చుకుంటే టాక్ పరంగా ఈ సినిమా కాస్త వెనకబడే ఉంది.
అయితే ఈ “దీపావళి కి తెలుగు ప్రేక్షకుల దారెటో”, ఈ నాలుగు సినిమాలలో థియేటర్లలో సౌండ్ చేసే ఆ దీపావళి స్పెషల్ బాంబ్ ఎదో తెలియాలి అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.




