అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని హత్య చేసేందుకు ఇరాన్ పెద్ద కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాని అప్రమత్తం చేశాయట!
అయితే అమెరికా-ఇజ్రాయెల్ దళాలు తొలిరోజే ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ నివాసంపై దాడులు చేసి కుటుంబ సభ్యులతో అందరినీ చంపేసినప్పుడే దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అది ప్రకటించినా ప్రకటించకపోయినా జరిగేది అదే.
కనుక శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకాలు చేసినంత మాత్రాన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని అది క్షమించేసినట్లు కాదు. అసలు ఆ ఒప్పందాన్నే గౌరవించని ఇరాన్, తమ దేశాధ్యక్షుడిని, అయన కుటుంబాన్ని చంపేసి, నేటికీ ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తున్న ట్రంప్‌ని క్షమిస్తుందని ఎలా అనుకోగలం?
ట్రంప్ స్వయంగా తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని తను పలువురి హిట్ లిస్టులో ఉన్నానని చెప్పుకుంటున్నారు కూడా. కనుక ట్రంప్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకోకపోతేనే ఆశ్చర్యపోవాలి కానీ తీర్చుకుంటే కాదు.
ట్రంప్ దుందుడుకుగా ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి తన ప్రాణాలకే కాదు అమెరికా భద్రతకు కూడా చేజేతులా ముప్పు తెచ్చుకున్నారని చెప్పక తప్పదు.
కనుక ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ప్రత్యేకంగా ఈ విషయం అమెరికాకు చెప్పనవసరం లేదు. కానీ ఇరాన్ తన ప్లాన్ ఏవిధంగా అమలుచేయాలనుకుంటోందనే విషయం కనిపెట్టి చెప్పగలిగితే, భద్రతా సిబ్బంది ట్రంప్ ప్రాణాలు కాపాడుకోగలరు.
మళ్ళీ అమెరికా-ఇరాన్ మద్య శాంతి చర్చల గురించి ఇరు దేశాల ప్రతినిధులు ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఇలాంటి హెచ్చరిక చేయడం చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టించగలదు. ఇజ్రాయెల్ చెప్పిన ఈ కొత్త విషయంతో ట్రంప్ ఆవేశపడి ఇరాన్ మీద దాడులు పెంచితే అది ఈ యుద్ధాన్ని మరో స్థాయికి చేర్చే ప్రమాదం కూడా ఉంటుంది.




