ట్రైలర్ టాక్ – భారతం నుండి బాహుబలి దాకా!

Drusthi Trailer Talkఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది… “భారతం నుండి బాహుబలి దాకా అన్నీ అమ్మాయి కోసమే జరిగాయ్!” అవును… ఇది అక్షర సత్యం. కామెడీగా చెప్పినా, సీరియస్ గా చెప్పినా ఆ డైలాగ్ లో ఎంతోకొంత వాస్తవం ఉంది. అందుకు ఈ “దృష్టి” ట్రైలర్ కూడా ఏమి మినహాయింపు కాదు. సస్పెన్స్ హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఒక అమ్మాయి తీసుకున్న నిర్ణయం చుట్టూ తిరిగినట్లుగా కనపడుతోంది. అలాగే ఆ అమ్మాయి కోసం సీక్వెల్ మర్డర్స్ జరిగినట్లుగా చూపించారు.

ADVERTISEMENT

‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో పావని గంగిరెడ్డి హీరోయిన్ గా నటించగా, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ గా కొనసాగుతోన్న వెన్నెల కిషోర్ మరో కీలకపాత్ర పోషించాడు. తన చుట్టూ సాగుతున్న మర్డర్స్ ను చూసి హీరో అవాక్కై, వాటిలోని ఆంతర్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చివరికి అతనినే షూట్ చేయడంతో ట్రైలర్ ముగుస్తుంది. పర్వాలేదనిపించే విధంగా ఉన్న ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT
Latest Stories