దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. ఫలితం ఏమిటనేది 10వ తారీఖున తెలుస్తుంది. అధికార పక్షానికి చెమటలు పట్టించామని బీజేపీ సంతోషంగా ఉంది. గెలుపు పట్ల ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు ఒక సర్వే కమలనాథులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తీన్మార్ మల్లన్న చేసిన ఈ సర్వే తెరాస గెలవడం ఖాయమని చెప్పుకొచ్చింది. అలాగే రెండో స్థానంలో కాంగ్రెస్ ఉండబోతుందని… కాంగ్రెస్ కు కొంచెం దగ్గరగా బీజేపీ మూడవ స్థానంలో ఉండవచ్చని చెప్పుకొచ్చింది ఆ సర్వే.
ఎన్నికల ముందు అంత హడావిడి చేసి బీజేపీ మూడవ స్థానానికి పరిమితం అయితే చాలా అప్రతిష్ఠ. అలాగే ఇప్పుడు బీజేపీకి ఉందని చెబుతున్న వేవ్ కూడా ఒక్కసారిగా పోతుంది. అలాగే ఆ పార్టీకి త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా పరాభవం కలిగే అవకాశం ఉంది. మరోసారి తెరాసకు తెలంగాణ మీద పట్టుచిక్కుతుంది.
ఓడిపోయినా పర్వాలేదు కనీసం రెండో స్థానం రావాలి… తెరాసకు స్వల్ప మెజారిటీ కి మించి రాకూడదు అని కమలనాథులు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందనరావు ఇదే సీటు నుండి ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి మూడవ స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే.




