మరికొద్ది గంటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “దువ్వాడ జగన్నాధమ్” ఫస్ట్ లుక్ విడుదల అవుతున్న నేపధ్యంలో…. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అల్లు అర్జున్ ను సరికొత్త గెటప్ లో ఉన్న ఈ ఫోటోలు బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో సదరు ఫోటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది డే గా మారిపోయాయి.
మెడలో జంధ్యం, ఒంటికి నామాలు, పంచె కట్టులో కనపడుతున్న బన్నీ బ్రాహ్మణుని గెటప్ లో ఉన్నారని ఇట్టే అర్ధమైపోతుంది. ఈ రోల్ ను ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’లో మినహా మరెవరూ ప్రయత్నించకపోవడంతో, ఖచ్చితంగా సినిమాకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయం. అలాగే బ్రాహ్మణుని గెటప్ బన్నీకి కూడా సూట్ అయ్యిందని చెప్పవచ్చు. లీక్ అయిన ఫోటోలతోనే ఇంతటి హంగామా చేస్తే… రేపు విడుదల కాబోయే ఫస్ట్ లుక్ తో బన్నీ సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.
‘గబ్బర్ సింగ్’ ఫేం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. బన్నీ ‘ముకుంద, ఒక లైలా కోసం’ సినిమాల ఫేం పూజా హేగ్దే హీరోయిన్ గా అందాలు ఆరబోయనుంది. వరుసగా సమ్మర్ లో తన చిత్రాలను విడుదల చేస్తూ, భారీ విజయాలు సొంతం చేసుకుంటున్న బన్నీ ఖాతాలో, మరో భారీ సక్సెస్ చోటు చేసుకోబోతుందన్న సంకేతాలను ఈ ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి.



