యూ ట్యూబ్ లో సరికొత్త ‘రికార్డుల’ వేట జరుగుతోంది!

Duvvada Jagannadham - Youtube Likes Dislikes Trendక్రేజీ సినిమాలకు సంబంధించిన టీజర్లు గానీ, పాటలు గానీ యూ ట్యూబ్ లో విడుదలయ్యాయి అంటే… ఒకప్పుడు ‘వాటికి ఎన్ని క్లిక్స్ వచ్చాయి?’ అనేదే ప్రామాణికంగా ఉండేది. ఫలానా హీరో టీజర్ కు ఇన్ని క్లిక్స్, మా హీరో టీజర్ కు ఇన్ని క్లిక్స్ అంటూ అభిమానులు సందడి చేసేవారు. ఇందులో కాస్త ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండేది. కానీ, ఇటీవల విడుదలైన “దువ్వాడ జగన్నాధమ్” టీజర్ తో యూ ట్యూబ్ లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అవును… బహుశా ఇంతకు ముందు ఎవరూ ఊహించి కూడా ఉండని ట్రెండ్ ‘దువ్వాడ’తో ప్రారంభమైన విషయం తెలిసిందే.

గతేడాది చివరిలో విడుదలైన “ఖైదీ నంబర్ 150” టీజర్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ‘లైక్స్’ అందుకున్న టీజర్ గా రికార్డు సృష్టించింది. అయితే దీనిని కొద్దిరోజుల్లోనే నందమూరి బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ట్రైలర్ తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక్కడ కూడా పోటీ కేవలం ‘లైక్స్’ మధ్యనే జరిగింది. కానీ, ‘దువ్వాడ’ ఎంట్రీతో అది కాస్త పక్కకు జరిగి ‘డిస్ లైక్స్’ వద్దకు చేరుకుంది. టాలీవుడ్ లోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ‘డిస్ లైక్స్’ అందుకున్న టీజర్ గా బన్నీ ‘దువ్వాడ’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

దీనికి కారణం ఎవరైనా… ఇప్పుడు మరో టీజర్ గానీ, ఇంకా ఏదైనా విడుదల అవుతోంది అంటే ఆటోమేటిక్ గా అందరి చూపులు ‘క్లిక్స్, లైక్స్’లను పక్కన పెట్టి ‘డిస్ లైక్స్’ మీదకు మళ్ళుతోంది. తాజాగా విడుదలైన “కాటమరాయుడు” మొదటి పాటగా టైటిల్ సాంగ్ ను యూ ట్యూబ్ లో విడుదల చేయగా, కొద్ది గంటల్లోనే ఈ పాటకు దాదాపుగా 11 వేల ‘డిస్ లైక్స్’ సొంతం చేసుకోవడం విశేషం. నిజంగా ఆ పాట నచ్చక ‘డిస్ లైక్స్’ కొట్టారో లేక ఉద్దేశపూర్వకంగా కొట్టారో గానీ, ఈ ‘ట్రెండ్’ అనేది టాలీవుడ్ లో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories