ఆత్మలు + సైన్సు = “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మూవీ!

ekkadiki-pothavu-chinnavada-movie-story-talkఆధ్యాత్మికాన్ని, సైన్స్ ను కలగలిపి “కార్తీకేయ” సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు హీరో నిఖిల్. ప్రస్తుతం ఆత్మలను, సైన్స్ ను కలిపి “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో మరో సూపర్ హిట్ ను అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నిఖిల్. ఈ నెల 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందడంతో సినిమాపై ఓ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కధకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను నిఖిల్ తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనేది బేసిక్ గా ఒక ప్రేమకధా చిత్రమని, అయితే ఇందులో హార్రర్ ఎలిమెంట్స్ ఉంటాయని, దర్శకుడు ఆత్మల మీద బాగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసి మరీ ఈ సినిమా తీసాడని అన్నాడు నిఖిల్. రష్యాలో ఒక అమ్మాయి సడెన్ గా లేచి తెలుగులో మాట్లాడిందట… మరి దానిని ఏమనాలి? ఆత్మలు ఉన్నట్లా? లేనట్లా? అందుకే ఓ సైంటిఫిక్ అప్రోచ్ తో సినిమాను తెరకెక్కించామని, ఆత్మలు, దెయ్యం అంటే మామూలుగా చూపించే జుట్టు విరబూసుకుని, కళ్ళ క్రింద కాటుక పెట్టుకుని వచ్చేలాగా ఈ సినిమాలో ఉండదని అన్నారు.

ADVERTISEMENT

ఇక, దర్శకుల విషయాలలో జోక్యం చేసుకుంటాడంటూ తనపై వస్తున్న విమర్శలకు కూడా బదులు చెప్పాడు నిఖిల్. “దర్శకుల పనిలో తానూ అస్సలు జోక్యం చేసుకోనని, అలా ఇన్వాల్వ్ అయితే సినిమా ఫ్లాప్ అవుతుందనే నమ్మే వ్యక్తులలో తానూ కూడా ఒకడినని, అయితే పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహిస్తానని, నాకు తోచిన సలహాలు ఇస్తాను, పబ్లిసిటీ విషయంలో మాత్రం నేను కూడా రంగంలోకి దిగుతానని స్పష్టం చేసాడు నిఖిల్.

ADVERTISEMENT
Latest Stories