రేపే మహాసంగ్రామం…అందరూ రెడీయేనా?

AP municipal elections 2026 polling arrangements

రేపు కడప మున్సిపల్ కార్పోరేషన్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పోరేషన్లకు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.

వీటిలో 13 మున్సిపల్ కార్పోరేషన్లకు 13 మంది మేయర్లను ఎన్నుకోవాల్సి ఉండగా మొత్తం 153 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటన్నిటిలో కలిపి మొత్తం 922 డివిజన్లు ఉండగా వీటిలో 118 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.

ADVERTISEMENT

కనుక మిగిలిన 804 డివిజన్లకు 3,307మంది కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఈ 13 మున్సిపల్ కార్పోరేషన్లలో కలిపి మొత్తం 59,97,918 మంది ఓటర్లున్నారు. రేపటి పోలింగ్ కోసం ఎన్నికల సంఘం మొత్తం 6,384 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

పురపాలక, నగర పంచాయతీల విషయానికి వస్తే 87 చైర్మన్‌ లేదా చైర్ పర్శన్ పదవులలో ఇప్పటికే 17 ఏకగ్రీవమైనందున రేపు మిగిలిన 70 పదవులకు పోలింగ్ నిర్వహించబోతోంది. ఈ 70 పోస్టులకు మొత్తం 367 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వీటిలో మొత్తం 3,020 వార్డులు ఉండగా 637 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కనుక మిగిలిన 2,382 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం రేపు పోలింగ్ నిర్వహించబోతోంది.

వీటి కోసం మొత్తం 6,669 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ 3,020 వార్డులలో మొత్తం 39,38,096 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఎన్నికల సంఘం 5,321 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

ఈసారి విశేషమేమిటంటే, మేయర్లను ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలే ఎన్నుకోబోతున్నారు. నవంబర్‌ 3వ తేదీన ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. నవంబర్‌ 5,6 తేదీలలో డిప్యూటీ మేయర్‌, వైస్ చైర్మన్‌, వైస్ చైర్ పర్సన్‌లను కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఎన్నుకుంటారు.

ADVERTISEMENT
Latest Stories