ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. చెప్పిన విధంగానే తాను పదవి నుండి దిగిపోయేలోపు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానిని ఆపడానికి ప్రభుత్వం సుప్రీం దాకా వెళ్లి అభాసుపాలు అయ్యింది. ఎన్నికలకు కోర్టు పచ్చ జండా ఊపడంతో నిమ్మగడ్డ యంత్రంగా మీద పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికలు వాయిదా వెయ్యాలని చుసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌లపై బదిలీ వేటు వేశారు. గత మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఉత్తరం రాశారు.
అలాగే ఈ ఎన్నికలకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే గ్రామా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను కూడా దూరంగా ఉండాలని ఆదేశించారు. వీరంతా జగన్ ప్రభుత్వం లో నియమింపబడిన వారే… పైగా ఎక్కువగా ఆ పార్టీ కార్యకర్తలే. వారు అధికారపక్షానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో వారిని తప్పించారు.
ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లైఫ్ లైన్ కట్ చేసినట్టు అయ్యింది. అలాగే నిమ్మగడ్డ అనుకుంటున్నట్టుగా కేంద్ర బలగాలను దింపితే అది అధికార పార్టీ కి సహజంగా ఎన్నికలలో ఉండే అడ్వాంటేజ్ చాలా వరకు తగ్గించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే అధికార పార్టీకి కొంత ఇబ్బందే.





