
నిత్యం నీతులు ధర్మపన్నాలు వల్లించే వైసీపీ నేతలలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో అవినీతి, అక్రమాలకు పాల్పడిన రికార్డులున్నాయి. వారి అధినేత జగన్‌పై 11 ఆక్రమస్తుల కేసులున్నాయి. వాటితో ఆయన 16 నెలలు జైలులో గడిపి వచ్చారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కనుక వైసీపీలో ఎవరి రికార్డ్ తిరగేసినా ఏదో ఓ స్టోరీ కనిపిస్తుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అటువంటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉందని టీడీపీకి తెలుసు. కానీ ఆయన గొప్పదనం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఏడు నెలలు సమయం పట్టింది.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
ఆయన, కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లాలో మంగళంపేట సమీపంలో అడవులలో సుమారు 75 ఎకరాలు కబ్జా చేశారు. అందుకోసం ఆ ప్రాంతంలో పెరిగిన పచ్చటి చెట్లని నరికించేశారు. ఇంకా జిల్లాలో పలు గ్రామాలలో వందల ఎకరాలు ఆయన కబ్జాలో ఉన్నాయి.
పైపైన తిరగేస్తేనే ఇన్ని బయటపడ్డాయి. కనుక వాటన్నిటి వివరాలు కనిపెట్టాలంటే మరింత లోతుగా విచారణ జరిపించాలి.
Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రులతో సమావేశమయ్యి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అటవీ భూముల కబ్జాల గురించి చర్చించిన తర్వాత విచారణ జరిపించాలని నిర్ణయించారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు దీని కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ ఆధ్వర్యంలో పని చేసే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు, ఫారెస్ట్ అధికారి యశోదాబాయ్ సభ్యులుగా ఉంటారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
కానీ ప్రతీసారి వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు బయటపడినప్పుడు ఇలాగే విచారణ పేరుతో హడావుడి చేయడం ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు అందరూ సైలంట్ అయిపోతుండటం పరిపాటిగా మారింది. పేర్ని నాని గోదాములలో నుంచి రేషన్ బియ్యం మాయం అవడం, కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి కేసులు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడుతూ పట్టుబడినా కూటమి ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోగా, కొన్ని రోజులు హడావుడి చేసిన తర్వాత అందరూ సైలంట్ అయిపోతున్నారు కూడా. కనుక ఇదీ అలాగే పక్కన పెట్టేయడం ఖాయమే అని భావించవచ్చు.
వైసీపీ నేతలు అవినీతికి, అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడినా ఎవరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే ప్రజలకు ఎటువంటి సందేశం వెళుతుంది?