‘స్కిన్ షో’ బ్యూటీ షాకింగ్ పిక్!

esha-guptaప్రస్తుతం నెటిజన్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరుగా ఈషా గుప్తా మారిపోయింది. హాట్ అండ్ సెక్సీ ఫోటోలకు నిలయంగా మారిన ఈషా అందచందాలు ట్రేడ్ వర్గాలలో క్రేజీగా మారడంతో, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈషా ఫోటోల రచ్చ మామూలుగా లేదు. సీక్వెల్స్ మాదిరి విడుదల చేస్తోన్న హాట్ పిక్స్ పరంపరలో తాజాగా ఓ షాకింగ్ ఫోటోను పోస్ట్ చేసింది ఈ అందాల బొమ్మ.

ADVERTISEMENT

రోజూ ‘స్పైసీ’ బిర్యానీ పెడుతూ పెడుతూ…. ఒక్కసారిగా పెరుగుతో కూడిన సద్ధనం పెట్టినట్లు… నిత్యం అడ్డు అదుపు లేకుండా అందాల విందు చేస్తున్న ఫోటోలను పెడుతూ… ఒక్కసారిగా ఎక్స్ పోజింగ్ చేయని ఫోటోను పోస్ట్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తను నటించిన లేటెస్ట్ మూవీ “బాద్ షాహో” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్టిల్ అంటూ రెడ్ డ్రెస్ తో దర్శనమిచ్చింది ఈషా.

బహుశా తన సౌందర్యాల ప్రదర్శనకు ‘ఇంటర్వెల్’ కార్డు పడినట్లుగా కనపడుతోంది. నెటిజన్ల నుండి ఫస్టాఫ్ ‘బంపర్ హిట్’ అన్న టాక్ తెచ్చుకుని తన ఫాలోయర్స్ ను 1.7 మిలియన్స్ కు పెంచుకున్న ఈషా, సెకండాఫ్ లో కూడా అదే ఊపును కొనసాగించినా లేక మరిన్ని బంపర్ బొనంజాలు పోస్ట్ చేసినా… అమాంతంగా ఫాలోయర్స్ వచ్చి చేరతారని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories