రాబోతున్న సంక్రాంతి మరింత మిక్కిలి ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే మూడు పెద్ద చిత్రాలు బరిలో నిలువగా, తాజాగా ప్రామిసింగ్ హీరో శర్వానంద్ కూడా ‘సై’ అన్నాడు. జనవరి 13 – నాన్నకు ప్రేమతో, 14 – డిక్టేటర్, 15 – సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.
అయితే, బాలయ్య బాబుతో పాటు జనవరి 14వ తేదీన “ఎక్స్ ప్రెస్ రాజా” రూపంలో శర్వానంద్ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన “ఎక్స్ ప్రెస్ రాజా” ధియేటిరికల్ ట్రైలర్ కు, ఆడియో కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
వీటికి తోడు ‘మిర్చి, రన్ రాజా రన్, జిల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి ఊపుమీదున్న యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడంతో సినిమా విజయం పట్ల శర్వా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అలాగే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించడంతో “ఎక్స్ ప్రెస్ రాజా” చిత్రం పక్కా హిట్ అంటున్నారు సినీ వర్గాలు. అయితే విడుదల తేదీనే సినిమాకు ‘ప్లస్’ కానీ, ‘మైనస్’ కానీ అవ్వోచ్చన్నది సినీ విశ్లేషకుల మాట.





