ఊహించని విషయం – భావన ఘటన బ్యాక్ గ్రౌండ్ నిజాలు!

facts behind bhavana molestation and kidnapసంచలనం రేపిన మలయాళ ముద్దుగుమ్మ భావన సంఘటన వెనుక తన మాజీ కారు డ్రైవర్ సునీల్ కుమార్ అని భావించిన వారికి షాక్ ఇచ్చేలా లేటెస్ట్ న్యూస్ అందుతోంది. ఇప్పటివరకు మాజీ కారు డ్రైవర్ హస్తం అనుకుంటే, పోలీసుల విచారణలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నారన్న విషయం బయటపడింది. శుక్రవారం రాత్రి భావనపై లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా, మిగిలిన నలుగురు వ్యక్తులు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT

భావన కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, ఈ కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఆరుగురికి ఈ కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని భావనకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

మళయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకోవడంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై ప్రకటన చేసి, నిందితులను త్వరగా పట్టుకుంటామని చెప్పారు. సిఎం చెప్పిన కొద్ది గంటల్లోనే పోలీసులు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి, మొత్తం ముగ్గురిని లోపల వేసి విచారణ జరుపుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తుంటే, ఇక తమకు రక్షణ ఎలా ఉంటుందని వాపోవడం ముద్దుగుమ్మల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories