పవన్ కళ్యాణ్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం!

dasari-pawan-kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఓ సినిమాకు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. 2015, ఫిబ్రవరి 23వ తేదీన దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన ‘పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాను ప్రారంభిస్తానన్న ప్రకటన’ టాలీవుడ్ లో సంచలనాత్మకమైంది. అయితే అప్పటినుండి హల్చల్ చేసిన ఈ వార్త మధ్యమధ్యలో తెరపైకి వచ్చింది గానీ, కార్యరూపం మాత్రం దాల్చుకోలేదు.

పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఇలాగే వాయిదాలు పడుతూ ‘వాయిదా సంవత్సరాలు’ జరుపుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాసరి దర్శకత్వం వహిస్తారనే భయంతోనే ఈ సినిమా ప్రారంభం కాకూడదని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తానూ దర్శకత్వం వహించనని దాసరి ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత దాసరి బ్యానర్ లోనే సినిమా ఉండవచ్చని ఒక అంచనా.

ADVERTISEMENT

fans against pawan kalyan dasari narayana rao movie

ADVERTISEMENT
Latest Stories