పవన్, మహేష్ అభిమానుల్లో పెను విషాదం!

mahesh-babu-pawan-kalyanతమ అభిమాన హీరోల ఫ్లెక్సీలు పెట్టుకుని కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని భావించిన ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాదం అలుముకుంది. తూర్పు గోదావరి జిల్లలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో అయిదుగురు సినీ అభిమానులు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరో పది మంది గాయాల పాలయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాలోని రంగంపేట మండలం, వడిసలేరులో పవన్ అభిమానులు ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి చేర్చారు. వీరిలో ఇద్దరికీ కాస్త సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే తరహ సంఘటన అదే జిల్లాలోని మండపేట మండలం, మారేడుపాకలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఎదురయ్యింది. 20 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ముగ్గురు అక్కడికక్కడే ‘కాలం’ చేసారు. పలువురికి గాయలవ్వగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా వేదికగానే అయిదుగురు అభిమానులు కొత్త సంవత్సరంలో మరణించడం, వారి కుటుంబాలలో పెను విషాదాన్ని నింపింది.

ADVERTISEMENT
Latest Stories