బాలయ్య సినిమా వేడుకలో విషాదం!

fire accident at Gautamiputra Satakarni narthaki theatre in nellore నెల్లూరు జిల్లాలో బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అర్ధ శతదినోత్సవ వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. నర్తకి థియేటరు వద్ద తెల్లవారుజాము నుండే బాలకృష్ణ అభిమానులు సందడి చేయడం ప్రారంభించారు. తమ హీరో చిత్రం 50 రోజుల పండగను ఘనంగా జరుపుకోవాలన్న ఉత్సాహం కాస్త చివరికి విషాదంగా మారింది.

భారీ ఎత్తున బాణసంచా కాల్చడంతో, పక్కనే ఉన్న ఆయిల్ గోడౌన్, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఘటన వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ, నష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories