పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి ఉన్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు

G. V. Harsha Kumar comments on pawan kalyanఅమలాపురం మాజీ ఎంపీ, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత హర్ష కుమార్ తిరుపతిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై స్పష్టత లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కు కనీసం ఆయన అన్న చిరంజీవికి ఉన్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు.

ADVERTISEMENT

“ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తాడో? ఎప్పుడు జవాబు ఇస్తాడో ఆయనకే తెలీదు. ప్రశ్నిస్తా అని చెప్పుకుని ఓట్లు అడిగి ఇప్పుడు ప్రశ్నించడం కూడా మర్చిపోయాడు. అసలు ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడో లేదో కూడా ఆయనకే తెలీదు,” అని హర్షకుమార్ విమర్శించారు. సమైఖ్య ఆంధ్ర ఉద్యమంలో ఆయన కాంగ్రెస్ పార్టీనుండి సస్పెండ్ అయ్యారు.

తరువాత కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యి 2014 లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. మొన్న ఆమధ్య కాంగ్రెస్ పార్టీ పోలవరం సభలో ప్రత్యక్షం అయ్యారు. అప్పటినుండి మళ్ళి కాంగ్రెస్ లో చేరతారా అని ఊహాగానాలు సాగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories