కాలక్షేప సదస్సులతో మిగిలింది అదే…

Visakhapatnam_G20ఈనెల 3,4 తేదీలలో విశాఖలో అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరిగింది. దాని ద్వారా రాష్ట్రానికి 13.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటితో ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి గుడివాడ గొప్పగా చెప్పుకొన్నారు. అయితే వాటిలో ఒక్క కంపెనీ వందకోట్లు పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించినా చాలా గొప్పవిషయమే అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఆ సదస్సు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన అంతా ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ఆడిన నాటకమని ఎంపీ రఘురామ అన్నారు.

ADVERTISEMENT

వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే, వైసీపీ ప్రభుత్వానికి మిగిలిన ఈ ఒక్క ఏడాదిలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటు అసాధ్యం. కనుక వాటితో ఉద్యోగాలు అసాధ్యమే. కానీ వచ్చేస్తున్నాయంటే ఎప్పుడో జరుగబోయేది ఇప్పుడే జరిగిపోతున్నట్లు చూపుకొంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అని చెప్పవచ్చు.

కనుక గ్లోబల్ సదస్సు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రకటనలు, ఖరీదైన ఆహారం, రవాణా, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటన ఖర్చులు అన్నీ కలిపి తడిపిమోపెడు కాగా వాటిలో విశాఖ సుందరీకరణ పనులకు పెట్టిన ఖర్చు మాత్రమే సద్వినియోగం అయ్యిందని చెప్పవచ్చు.

విశాఖలో మళ్ళీ నేటి నుంచి నాలుగు రోజులపాటు జీ-20 దేశాల సదస్సు జరుగనున్నాయి. ఈ సదస్సులో 57 యూరప్ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును అట్టహాసంగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కనుక మళ్ళీ భారీగా ఖర్చుపెట్టకతప్పలేదు.

మూడు వారాల క్రితం జరిగిన గ్లోబల్ సదస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సుందరీకరణ పనులు చేసింది. మళ్ళీ ఈ సదస్సు కోసం రూ.157 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ సదస్సులతో పరిశ్రమలు, ఉద్యోగాలు రాకపోయినా, విశాఖ నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు విశాఖవాసులు చాలా సంతోషిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories