పవన్ తో స్నేహం కొనసాగాలని భావిస్తున్నా – మహేష్ బావ!

Galla Jayadev comments on Pawan Kalyanప్రిన్స్ మహేష్ బాబు బావ, గుంటూరు టిడిపి ఎంపీ అయిన గల్లా జయదేవ్ వర్తమాన రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల రాజకీయ కెరీర్ లపై తన భావాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏ మాత్రం లేదని ఒక్క ముక్కలో తేల్చేయగా, పవన్ మాత్రం ఇప్పటికీ తమ మిత్రుడేనని తెలిపారు.

ADVERTISEMENT

సమాజ అభివృద్ధి కోసం పవన్ పరితపిస్తుంటారని, టిడిపితో ఉన్న స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పిన గల్లా జయదేవ్, ‘జనసేన’ అధినేత పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్ధం కావడం లేదని అన్నారు. పొత్తులనేవి పరస్పర వర్గాల నుండి ఉంటుంది గానీ, ఒక సైడ్ నుండి ఎప్పుడూ ఉండదని, జనసేన, బిజెపిలతో పొత్తు విషయమై చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories