గన్నవరం గెలుపు వంశీ క్రెడిట్ అయితే మరి పులివెందుల ఓటమి..?

Gannavaram Pulivendula YSRCP Results

తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికల ప్రజాతీర్పు అటు అధికార కూటమి పార్టీలకు ఇటు విపక్ష వైసీపీకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను, మరెన్నో విశ్లేషణలను చర్చలోకి తెచ్చింది. వాటిలో ఒకటి గన్నవరంలో వైసీపీ విజయం అయితే మరొకటి పులివెందులలో వైసీపీ ఓటమి.

ఈ రెండు స్థానాలలో వైసీపీ గెలుపోటముల మీద భిన్న వాదనలు తెరమీదకొస్తున్నాయి. 2024 ఎన్నికల తరువాత గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ తన రాజకీయ పట్టును కోల్పోయారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వంశీ చేసిన హద్దులు దాటిన తప్పులకు నేడు మూల్యం చెల్లిస్తున్నారంటూ టీడీపీ తమ్ముళ్లు అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

గతంలో బాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు, టీడీపీ కార్యాలయం పై వంశీ దాడి చేయించారని, ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసారని ఇలా అనేక ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు వంశీ. చివరికి చట్టం తన పని తానూ చేయడంతో వంశీ జైలు జీవితం కూడా అనుభవించవలసి వచ్చింది.

ఇలా ఒకప్పుడు గన్నవరం రాజకీయాలలో తన మార్క్ రాజకీయ చూపిన వంశీ 2024 ఎన్నికల ఓటమి తరువాత నుంచి క్షేత్రస్థాయి రాజకీయాలకు దూరమయ్యారు. దానికి తోడు జైలుకు వెళ్లిరావడంతో యాక్టీవ్ రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గన్నవరంలో వైసీపీ రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోయిందని భావించిన వారికీ తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ జయకేతనం ఎగరేయడం తో గన్నవరం పై రాజకీయ ఆసక్తి పెరిగింది.

వంశీ ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే అనగాని రవి గన్నవరం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేశారు. దీనితో ఇది వల్లభనేని వంశీ పొలిటికల్ కంబ్యాక్ అంటూ, వంశీ ఆగమనం మొదలు అంటూ, గన్నవరంలో వంశీ పొలిటికల్ గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇదే నిదర్శనం అని…ఇలా గన్నవరం వైసీపీ జడ్పీటీసీ విజయాన్ని వంశీ ఖాతాలో వేస్తూ వల్లభనేని వంశీకి వైసీపీ సోషల్ మీడియాలో మంచి ప్రచారం జరుగుతుంది.

అయితే గన్నవరం లో వైసీపీ విజయం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ క్రెడిట్ గా చెబుతున్న వైసీపీ శ్రేణులు పులివెందుల వైసీపీ ఓటమి బాధ్యతను జగన్ ఖాతాలో వెయగలరా.? గన్నవరంలో వంశీ పొలిటికల్ గ్రాఫ్ పెరగడంతోనే వైసీపీ విజయం సాధ్యమైందని అంటున్న వైసీపీ శ్రేణులు పులివెందులలో జగన్ పొలిటికల్ గ్రాఫ్ తగ్గిందని అంగీకరించగలరా.?

పార్టీ విజయాన్ని నాయకుడి నాయకత్వానికి ఆపాదిస్తూ జబ్బలు జరుచుకుంటున్నప్పుడు పార్టీ పరాజయానికి కూడా అదే నాయకత్వం జవాబుదారిగా చూపగలరా.? గన్నవరంలో వంశీకి క్రెడిట్ ఇస్తే పులివెందులలో జగన్ బాధ్యత తీసుకుంటారా.?

ADVERTISEMENT
Latest Stories