వైసీపీ స్ట్రైక్ రేట్ 6 శాతం.. మేమే గెలిచాం!

YSRCP Strike Rate in AP Parishad Elections

పరిషత్ ఎన్నికల్లో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతం. అంటే వైసీపీది కేవలం 6 శాతం. అయినా వైసీపీ సత్తా చాటింది. ప్రజలు మా వైపే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకోవడం చాలా కామెడీగా ఉంది. ఈ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన కూటమి నేతలు చెప్పుకోవాల్సిన ఈ మాటలను వైసీపీ చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు.

ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్ల విషయంలోనే కొన్ని సమస్యలు మొదలయ్యాయి. ఆ కారణంగా రెబల్ అభ్యర్థులు బరిలో దిగారు. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ కాకపోవడం వల్లనే ఆ 6 శాతం కోల్పోయింది.

ADVERTISEMENT

ఒకవేళ కూటమి పార్టీలు సకాలంలో ఈ లోపాలు సరిదిద్దుకొని ఉండి ఉంటే ఈ ఎన్నికలలో కూటమి తప్పక కనీసం 97-98 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ఉండేది.

ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పార్టీలు అప్పుడే ఎక్కడ లోపాలు జరిగాయి? ఎందువల్ల జరిగాయి?అని సమీక్షించుకుంటున్నాయి.

కానీ శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఇంకా దారుణంగా ఓడిపోయిన వైసీపీ మాత్రం, తమ ఓటమికి ఆత్మపరిశీలన చేసుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేస్తోంది.

తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు, రాష్ట్ర రాజధాని, పరిశ్రమల విషయంలో అనుచిత వైఖరి కారణంగానే వైసీపీ ఘోర పరాజయం పాలైందని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు.

కానీ పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఎవరు చేయలేరు కనుక ఆయన సూచించినట్లే కూటమి దౌర్జన్యాల వల్లనే ఓడిపోయామని చెప్పుకుంటున్నారు. మంచిదే!

కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీని టైటానిక్ షిప్పులా నడిపిస్తున్నారని తెలిసి ఉన్నా దానిలోనే ప్రయాణించాలనుకుంటే ఎవరు కాదనగలరు?

బహుశః ఇలాంటి వారి కోసమే షర్మిల ‘కాంగ్రెస్‌ పడవ’ వేసుకొని వస్తే ‘టైటానిక్’లో ఉన్న వారి కంటికి అది ఆనలేదు. కనుక ఎవరూ ఎక్కలేదు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత విజయసాయి రెడ్డి కొత్త పార్టీతో రావడం చాలా మంచి టైమింగ్ అనే చెప్పాలి. నవంబర్‌ 11న అయన మరో కొత్త షిప్పు వేసుకుని వస్తున్నారు. దానిలోనైనా వైసీపీలు ఎక్కుతారో లేక టైటానిక్‌లో ప్రయాణమంత సుఖం మరొకటి లేదనుకుంటారో?

ADVERTISEMENT
Latest Stories