60 కోట్ల క్లబ్ లోకి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’

Gautamiputra Satakarni Box Office Collections 60 Croresభారీ అంచనాలతో విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. బాలయ్య కెరీర్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు 60 కోట్ల చేరువలో ఉందని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలలో 40 కోట్లు షేర్ దాటిన ఈ సినిమా, అంతిమంగా 60-70 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సూపర్ హిట్ సినిమాగా ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే అన్ని ఏరియాలలో కూడా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి, ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయిందని తేలడంతో ‘శాతకర్ణి’ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బరిలో మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా ఉన్నప్పటికీ, చారిత్రాత్మకమైన విజయాన్ని దక్కించుకుని… సాహో శాతకర్ణి అని అనిపించుకుంటున్నాడు ఈ నందమూరి నటసింహం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories