చెట్టు క్రింద “శాతకర్ణి” లుక్ ను చూడండి!

gautamiputra-satakarni-movie-balakrishna-stillsgautamiputra-satakarni-movie-balakrishna-stillsక్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న “గౌతమీపుత్ర శాతకర్ణి” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి టార్గెట్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ స్టిల్స్ ఇప్పటికే చాలా విడుదలయ్యాయి. ఒక వారియర్ గా, రాజుగా వివిధ రూపాలలో నందమూరి నటసింహం అభిమానులను ఆకట్టుకున్నాడు. అలాగే తాజాగా మరికొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

యోధుడు గెటప్ లో కత్తితో ఉన్న బాలకృష్ణ స్టిల్ అభిమానులకు కన్నులవిందుగా మారింది. గుబురు మీసాలతో ఉన్న బాలయ్య బాబు తీరు చూస్తుంటే వెండితెరపై చెలరేగడం ఖాయంగా కనపడుతోంది. అయితే కాస్ట్యూమ్స్ పరంగా సదరు ఫోటోలు పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, యోధుడు గెటప్ లో బాలయ్య బాబు సూట్ అయ్యాడని సదరు ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. మరి నందమూరి నటసింహం విశ్వరూపం చూడాలంటే సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories