‘ఖైదీ’ విడుదల చేసిన రోజే ‘శాతకర్ణి’

gautamiputra-satakarni-vs-khaidi-no-150సినీ హీరోలను పరోక్షంగా శాసించేది అభిమానులే అన్న విషయం అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే ఏ హీరోను తీసుకున్నా ఎక్కువగా అభిమానులను మెప్పించే కధలనే ఎంపిక చేసుకుంటారు. ముఖ్యంగా మెగా హీరోలు ఇందులో సిద్ధహస్తులన్న విషయం తెలిసిందే. అయితే కధల విషయంలో కాకపోయినా… రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ప్రస్తుతం నందమూరి అభిమానులు పట్టుబట్టి మరీ కూర్చుకున్నారని ట్రేడ్ టాక్.

ఈ నెల 11న విడుదల అవుతున్న మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” విడుదల అవుతున్న రోజునే, నందమూరి నటసింహం “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాను కూడా విడుదల చేయాలని అభిమానులు ఏకంగా దర్శకుడు క్రిష్ ఆఫీస్ ముందర డిమాండ్ చేయడం విశేషం. జనవరి 12న కాకుండా 11వ తేదీనే రిలీజ్ చేయాలని క్రిష్ కార్యాలయం ముందు బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

ADVERTISEMENT

‘శాతకర్ణి’ నిర్మాత సాయిబాబు బాలయ్య అభిమానులతో మాట్లాడారు. విడుదల తేదీపై రేపు నిర్ణయం తీసుకుందామని నచ్చచెప్పడంతో, అభిమానులు శాంతించారు. పోటీతత్వం మంచిదే గానీ, నిర్మాతల శ్రేయస్సును కూడా పట్టించుకోకుండా ఇలా తమదైన శైలిలో స్పందించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘బాలయ్య వర్సెస్ చిరు’ అంటే ఆ మాత్రం కసి అభిమానుల్లో ఉండడం సర్వసాధారణమే అంటున్నారు సినీ జనాలు.

ADVERTISEMENT
Latest Stories