‘నాన్ బాహుబలి’ రికార్డు కొల్లగొట్టే ఛాన్స్!

Geetha Govindam- breaks non baahubali recordsమాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాలలో అద్వితీయమైన కలెక్షన్స్ ను అందిపుచ్చుకుంటోన్న “గీత గోవిందం” పొరుగు రాష్ట్రమైన తమిళనాట కూడా చెలరేగిపోతోంది. తొలి అయిదు రోజుల్లోనే ఈ సినిమా 3.3 కోట్లు కొల్లగొట్టి భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇదేమి సామాన్యమైన కలెక్షన్స్ కాదు.

రామ్ చరణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ “రంగస్థలం” సినిమా మొత్తం కలెక్షన్స్ 3.5 కోట్లు కాగా, ఆ తర్వాత విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు 4.3 కోట్లు కొల్లగొట్టి నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 5 రోజుల్లోనే విజయ్ దేవరకొండ “గీత గోవిందం” 3.3 కోట్లు సాధించడంతో, “భరత్ అనే నేను” కలెక్షన్స్ ను అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు.

ADVERTISEMENT

హీరోగా చేసిన నాలుగవ సినిమాకే మహేష్ బాబు వంటి హీరోల సినిమాల రికార్డులను తిరగరాస్తుంటే, టాలీవుడ్ అంతా ప్రస్తుతం విజయ్ నామస్మరణ చేయకుండా ఎలా ఉంటుంది. అక్కడ ఇక్కడ అని లేదు… మొత్తం గ్రౌండ్ అంతా తన కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తున్నాడు విజయ్ దేవరకొండ అలియాస్ విజయ్ గోవింద్.

ADVERTISEMENT
Latest Stories