‘మేడమ్’ను మిస్సయిన ‘క్యూట్’ హీరోయిన్!

Raashi-Khannaఈ ఏడాది మొదట్లో ‘తొలిప్రేమ’తో హిట్ ను, ‘శ్రీనివాస కళ్యాణం’తో ఫ్లాప్ ను అందుకున్న క్యూట్ హీరోయిన్ రాశి ఖన్నా ఓ బంపర్ అవకాశాన్ని మిస్ చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోన్న “గీత గోవిందం” సినిమాలో ‘మేడమ్’ అనిపించుకునే అవకాశం తొలుత రాశి దరికే చేరిందట.

[m9ad]

ADVERTISEMENT

అయితే అనివార్య కారణాలతో ఈ సినిమాను పక్కన పెట్టి, నితిన్ సరసన ‘శ్రీనివాస కళ్యాణం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా రాశికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది గానీ, హిట్ ను మాత్రం అందించలేకపోయింది. కానీ దీని తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక రోల్ అదిరిపోయే ఉండడం, బంపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం ‘మేడమ్’ అన్న పదం యూత్ ను ఊపేస్తోంది.

దీంతో ‘ఛలో’ సినిమా తర్వాత మరో హిట్ ను ఖాతాలో వేసుకుని రష్మిక దూసుకుపోతుండగా, ‘శ్రీనివాస కళ్యాణం’ పరాజయంతో పాటు హిట్ సినిమాను చేజార్చుకున్న రాశి ఖన్నా డీలా పడిపోయిందట. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసహజం అయినప్పటికీ, ఈ రెండు సినిమాలు అయిదు రోజుల గ్యాప్ లో విడుదల కావడంతో రాశి – రష్మికల ‘మేడమ్’ మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories