తెలంగాణలో గోదావరి నీళ్ళని వాడుకోలేరు కానీ..

Godavari Flooding at Dhavaleswaram

భద్రాచలం వద్ద అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. నేడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రిలో గోదావరి ఉదృతంగా ప్రవేశిస్తోంది. ధవళేశ్వరం నుంచి నేడు 5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల కాబోతోంది చేశారు… వంటి వార్తలు ప్రతీ వర్షాకాలంలో వింటూనే ఉంటాము.

కనుక రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి నీటిని వాడుకోలేక సముద్రంలోకి విడిచి పెట్టేస్తున్నాయని వార్తలు రావడమే కాదు ఎదురుగా కనబడుతోంది కూడా. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెపుతున్నారు కదా?

ADVERTISEMENT

వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిలో కొంత బనకచర్ల ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలిస్తే తప్పేమిటి? తెలంగాణకు ఏవిదంగా నష్టం జరుగుతుంది? అని అడుగుతుంటే ఆయన ప్రశ్నకు బీఆర్ఎస్‌ పార్టీలో ఎవరూ సూటిగా సమాధానం చెప్పడం లేదు.

కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో నుంచి కాలువలు తవ్వించి ఏపీకి నీటిని తరలించుకుపోతున్నారన్నట్లు బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

తద్వారా తెలంగాణ ప్రజలను తప్పు దారి పట్టిస్తుండటమే కాకుండా వారిని రెచ్చగొట్టి సెంటిమెంట్ రగిలించి తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని ఆరాటపడుతున్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తెలుసు కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ మాట్లాడక తప్పలేదు.

కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్ట మొదటిదైన మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లు ఎత్తేసి గోదావరి నీటిని దిగువకు వదిలేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గేట్లు వేసి నీటిని నిలువ చేస్తే బ్యారేజి మొత్తం కొట్టుకుపోయి దిగువన 44 గ్రామాలతో పాటు భద్రాచలం కూడా మునిగిపోతుందని, అందుకే ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నామని ఆ రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు

తెలంగాణలో ఉదృతంగా ప్రవహిస్తున్న ఆ గోదావరి నీటినే వాడుకోలేక కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు పరస్పరం నిందించుకుంటూ, దిగువన ఏపీలో సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్ళని వాడుకోవాలనుకుంటే, ఆ నీటి కోసం పోరాడుతున్నామని, తద్వారా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నామని బీఆర్ఎస్‌ నేతలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

బీఆర్ఎస్‌ పార్టీ మనుగడ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తూ వాటికీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరు వాడుకోవడం వారికి సిగ్గనిపించడంలేదు కూడా.

ADVERTISEMENT
Latest Stories