భారత సాంప్రదాయ వస్తులలో అతి విలువైనదిగా బంగారం పేరుగావించింది. అయితే నానాటికి కొండెక్కుతున్న ఈ బంగారం ధరలు చూస్తే లేని వాడు కొనలేనిదిగా ఉన్నవాడు వాడులేడు అన్నట్టుగా తయారయ్యింది.
కొండెక్కిన ఈ బంగారం ధరలు ఇప్పుడు సామాన్య మధ్య తరగతి వాడికే కాదు అంతకు మించిన స్థాయి వారికీ కూడా అందలేని పరిస్థితిలో ఉంది. ధనిక వర్గం ప్రజలకు, సెలబ్రెటీలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బంగారం రోజురోజుకి మరింత ప్రియంగా ఎందుకు మారుతుంది.
ఈ బంగారానికి పెరగడమే తప్ప తగ్గడం తెలియదా.? పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి వర్తించదా.? అన్నట్టుగా పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. భారతీయ సంప్రదాయంలో భాగంగా జరుపుకునే ప్రతి శుభకార్యానికి ఈ పుత్తడి కొనుగోలు అనేది తప్పనిసరి.
అయితే ఇప్పుడు వివాహాది శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో ఈ బంగారం ధరలు అటు కొనుగోలుదారులను భయపెడుతున్నాయి. దేశంలో నేడు బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర 1.30 లక్షలు దాటింది.
అయితే గోల్డ్ రేట్లు ఈ విధంగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్, ఆర్థిక మాంద్యం, పెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం పై అంచనాలు, అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్దాలు) దానికి తోడు దేశాల మధ్య తలెత్తుతున్న వాణిజ్య ఒప్పొందాలు అన్ని కలిపి బంగారం ను మరింత ప్రియంగా మారుస్తున్నాయి.
అలాగే సామాన్యుడికి అందనంత దూరంలో ఉంచుతున్నాయి. ఇటు పక్క బంగారం ధరలు కొండ కాదు ఏకంగా ఎవరెస్టు ఎక్కడంతో మరో పక్క సిల్వర్ కూడా దాని ఆల్ టైం రికార్డులను సృష్టిస్తూ వెండి కూడా బంగారం పూత పూసుకుంటుంది. నేటి సిల్వర్ రేట్ కేజీ 1,57,400 గా ఉంది. ఇలా ఇటు బంగారం అటు వెండి పెరుగుతూ పోవడం వినియోగదారుడిని ఆందోళనకు గురి చేస్తుంది.




