ప్రభుత్వోద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా? ఏది బెటర్?

Government job vs private job: Comparing career security, growth, competition and layoffs in India.

మన దేశంలో ప్రభుత్వోద్యోగాలు, ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలగా కృషి చేస్తే యువత ఉంది. అలాగే ఇంజనీరింగ్ లేదా మరో డిగ్రీ పూర్తిచేసి ఐటి తదితర రంగాలకు మొగ్గు చూపే యువత కూడా ఉంది.

ADVERTISEMENT

ఎవరి ఆలోచనలు, లెక్కలు వారివి. కనుక జీవిత భద్రత, ఉద్యోగ భద్రత కల్పించే ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నించడం మంచిదా? లేక ఆ రెండూ లేకపోయినా త్వరగా ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో ముందుకు సాగేందుకు ప్రైవేట్ ఉద్యోగాలు మంచివా? అని ఆలోచిస్తే రెండూ మంచివే అనిపిస్తుంది.

కానీ దేని సమస్యలు దానికున్నాయి. ప్రభుత్వోద్యోగాల కోసం లక్షల మందితో పోటీ పడాలి. ఆ పోటీ కోసం చాలా మంది ఏళ్ళ తరబడి కోచింగ్ తీసుకుంటూ, ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

ఒక నిర్దిష్ట లక్ష్యంతో కృషి చేయడం మంచిదే. కానీ ఆ లక్ష్యం సాధించేందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితి, అనేక విఫలయత్నాలు, ఉద్యోగాలకు అర్హత సాధించినా ప్రజా ప్రతినిధులు లేదా సంబంధిత శాఖలలో లంచగొండితనం, ఇంకా వయోపరిమితి వంటి అనేక సమస్యలు అవరోధాలు అధిగమించాల్సి ఉంటుంది.

రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ మార్పిడి వలన కూడా ప్రభుత్వోద్యోగాలు సాధించడం కష్టతరంగా మారుతుంది. ఏళ్ళ తరబడి శ్రమిస్తే అదృష్టం బాగుంటే ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. లేకుంటే ప్రైవేట్ ఉద్యోగానికి కూడా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.

అంటే వీటి కోసం రిస్క్ తీసుకోవాలా వద్దా? అని ముందే ఆలోచించుకోవాలి. రిస్క్ తీసుకునే ఓపిక, సామర్ధ్యం రెండూ ఉన్నాయో లేవో ముందే అంచనా వేసుకోవడం మంచిది.

ప్రభుత్వోద్యోగాలతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఇంజనీరింగ్ లేదా తగిన అర్హత ఉంటే సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి. మంచి కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తే, చాలా త్వరగా జీవితంలో సెటిల్ అవవచ్చు. కుటుంబం కూడా గాడిన పడుతుంది.

కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ఓ వైపు పని గంటలు, పన్ని ఒత్తిళ్ళు పెరుగుతుంటే మరోవైపు నానాటికీ ఉద్యోగ భద్రత తగ్గిపోతోంది.

ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలీని పరిస్థితి. సీనియారిటీ పెరిగితే జీతం, గౌరవంతో పాటు బాధ్యతలు కూడా పెరుతాయి. కానీ ఈరోజుల్లో సీనియారిటీ కూడా ఓ శాపంగా మారింది. సీనియారిటీ పెరిగితే ఉద్యోగాలు ఊడే ప్రమాదం పెరుగుతుంటుంది.

అన్నేళ్ళు పనిచేసిన తర్వాత, కుటుంబ బరువు బాధ్యతలు, వయసు పెరిగిన తర్వాత హటాత్తుగా ఉద్యోగం ఊడితే.. ఆ నరకం అనుభవించేవారికే తెలుస్తుంది.

ఏఐ వల్లనా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నా, అన్నీ అదే చక్కేబెట్టేస్తుండటంతో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. నడి వయసులో ఉద్యోగం ఊడితే, మరో ఉద్యోగం సంపాదించుకోవడం చాలా కష్టం.

ముఖ్యంగా తమ కంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నవాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. విధిలేని పరిస్థితిలో పోటీ పడినా, కంపెనీలు తక్కువ వయసున్నవారికే మొగ్గు చూపుతుంటాయి. కనుక ఉద్యోగం ఊడటం కంటే ఈ వైఫల్యం మనుషులను ఎక్కువగా క్రుంగ దీస్తుంది.

కనుక జీవితాంతం అభద్రతతో బ్రతకడమా లేదా భద్రత కల్పించే ఉద్యోగం కోసం జీవితాన్ని పణంగా పెట్టి పోరాడాలా? అనేది ఎవరికీ వారు నిర్ణయించుకోవాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories