రాజకీయాలలో రాజీనామా అంటే ‘రాజీ’నేగా..?

Harish Rao BRS

రాజకీయాలలో ఒకరి మీద ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ చివరికి రాజీనామా అనే ‘రాజీ’ దగ్గర ఆగిపోవడం రాజకీయాలలో సర్వసాధారణంగా మారిపోయింది. అందునా ఎన్నికల సమయంలో ఈ సవాళ్లు స్థాయిని మించి ఉంటాయనేది తెలంగాణ రాజకీయాలను చూస్తే అర్ధమవుతుంది.

ADVERTISEMENT

బిఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి పై ఇటువంటి సవాళ్లనే విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకిచ్చిన 2 లక్షల రుణమాఫీ ఈ పంద్రాగస్టు లోపు చేయకుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ, ఒక వేళ కాంగ్రెస్ తన హామీ నిలబెట్టుకున్నట్లయితే తాను రాజీనామా చేస్తానంటూ హరీష్ సవాల్ విసిరారు.

అయితే ఈ సవాల్ పై రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ గా స్పందిస్తూ హరీష్ ఇచ్చిన సవాల్ ను నేను స్వీకరిస్తున్నా, నీ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో తీసుకురావాలి అంటూ బిఆర్ఎస్ నేత హరీష్ కు ప్రతి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు ఈ అధికారం..? బిఆర్ఎస్ ప్రభుత్వంలా ప్రభుత్వ ఖజానా దోచుకోకుండా ఉంటే 40 వేల కోట్ల రుణమాఫీ ఇవ్వడం ఒక లెక్క కాదు అంటూ రేవంత్ బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యల పై ప్రతిస్పందించారు.

దీనితో ఈ సవాల్ పై ఎవరు నెగ్గుతారో…ఎవరు రాజీనామా చేస్తారో ఈ స్వాతంత్య్రదినోత్సవం రోజు తేలిపోనుంది. గతంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల కోసం ఎదురు చూసినట్లుగా ఇప్పుడు రాజీనామా పత్రాలు తీసుకు వచ్చి పెన్ను దొరకక రాజీనామా పై ‘రాజీ’ పడతారేమో అంటూ కాంగ్రెస్ క్యాడర్ హరీష్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ రాజకీయాలలో సాధ్యం కానీ సవాళ్ళే అని అటు రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు తెలిసినా ఇదిఒక రాజకీయ క్రీడలో భాగమే అని సరిపెట్టుకుంటారు.

ADVERTISEMENT
Latest Stories