బిఆర్ఎస్ లో హరీష్ నెగ్గాడు..మరి కాళేశ్వరం.?

Harish Rao and Kalvakuntla Kavitha political clash in BRS over Kaleshwaram corruption allegations

కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంపనలను సృష్టించాయి.

కాళేశ్వరం అవినీతిలో హరీష్, సంతోష్ ల ప్రమేయం ఉందని, వారి దన దాహం, అత్యాశ కలిపి కేసీఆర్ రాజకీయ జీవితానికి అవినీతి మరకలు అంటించాయని, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలతో హరీష్ తెరచాటు రాజకీయాలు నడుపుతున్నారంటూ వారిద్దరి మీద కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ చేరుకున్న హరీష్ రావు ను మీడియా చుట్టు ముట్టింది. కవిత ఆరోపణల పై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే అందుకు హరీష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు అటు బిఆర్ఎస్ లో ఇటు కేసీఆర్ రాజకీయ జీవితంలో తన పాత్ర, ప్రమేయం ఏమిటి అనేది అందరికి తెరచిన పుస్తకమే అంటూ హుందాగా బదులు చెప్పారు.

అయితే కవిత హరీష్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ బిఆర్ఎస్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ కవిత ను పక్కన పెట్టి మరి హరీష్ కు మద్దతు తెలిపింది. కవిత ప్రెస్ మీట్ తరువాత బిఆర్ఎస్ సోషల్ మీడియా హరీష్ 6 అడుగుల బులెట్ అంటూ పోస్ట్ చేయగా దానిని కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా మరోసారి రీ పోస్టు చేసి హరీష్ వెంటే బిఆర్ఎస్ అనేదానికి అధికారిక ముద్ర వేశారు.

ఈ రకంగా బిఆర్ఎస్ లో హరీష్, కవిత పై నెగ్గి కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర తన పట్టు నిలుకున్నారు. మరి ఈ విషయంలో కవిత మీద పై చేయి సాధించిన హరీష్ కాళేశ్వరం వివాదంలో కూడా కవిత చేసిన అవినీతి ఆరోపణల మీద నెగ్గగలరా.?

రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ కేసును సిబిఐ కి అప్పగిస్తూ బాల్ ను బీజేపీ కోర్టులోకి నెట్టింది. ఇప్పుడు కాళేశ్వరం లో అవినీతి అంటూ కవిత మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు ల పై బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో అధికారులు కవిత ను సాక్షిగా విచారణలో చేర్చితే అది హరీష్ ని ఇరుకునపెట్టే అంశమే అవుతుంది.

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు రావడం వెనుక, తన కుటుంబం తనను వ్యక్తిగతంగా, రాజకీయంగా దూరం చేయడం వెనుక హరీష్ హస్తం ఉందని బలంగా నమ్ముతున్న కవిత హరీష్ కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా.?

కాబట్టి హరీష్ కవిత విషయంలో బిఆర్ఎస్ లో సులభంగా నెగ్గి దర్జాగా పార్టీలో కొనసాగుతున్నారు. కానీ కాళేశ్వరం అంశంలో కూడా ఇదే మాదిరి కవిత ఆరోపణల నుంచి హరీష్ సులభంగా బయటపాడతారా.? పడగలరా.? అయితే ఈ విషయంలో మాత్రం హరీష్ అంత తేలికగా కవిత మీద నెగ్గే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT
Latest Stories