లేట్ అయ్యిందని బన్నీ దర్శకుడిని పక్కన పెట్టారు!

Harish Shankar Stopped By Air Indigo For Late Arrival‘గబ్బర్ సింగ్’తో తన ఫేట్ మార్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా “దువ్వాడ జగన్నాధమ్” సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే తాజాగా చెన్నై బయలుదేరేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ లో టికెట్ తీసుకున్న హరీష్ శంకర్ కు పరాభవం ఎదురైంది.

కొద్ది నిముషాల లేట్ అయినందుకు తమను విమానంలోకి పంపించలేదని, ఇండిగో ఫ్లైట్స్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి అసహనం వ్యక్తం చేసారు. కొద్ది నిముషాలు మాత్రమే లేట్ అయినా, ఇండిగో యాజమాన్యానికి ఇది చాలా సహజంగా మారిపోయిందంటూ తన భావాలను వ్యక్తం చేస్తూ… ట్విట్టర్ ద్వారా తెలిపారు హరీష్. అయితే షూటింగ్ లో భాగంగా చెన్నై వెళ్తున్నారో లేక వ్యక్తిగత పని మీద వెళ్తున్నారో గానీ, హరీష్ శంకర్ కాస్త ఎక్కువగానే నిరుత్సాహపడినట్లుగా ఉన్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories