వీడియో సాంగ్స్ – హాట్ అండ్ సెన్సుయస్!

hate-story-iv-tum-mere-ho-badnaamiyan“హేట్ స్టోరీ” సినిమాల సిరీస్ లు బాలీవుడ్ సినీ ప్రేక్షకుల సుపరిచితమే. హాట్ అండ్ బోల్డ్ గా తెరకెక్కించే ఈ సినిమాల సిరీస్ ప్రస్తుతం నాలుగవ భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 9వ తేదీన విడుదల కాబోతున్న లేటెస్ట్ “హేట్ స్టోరీ 4” పబ్లిసిటీలో భాగంగా వరుసగా వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఊర్వశి రుతేలా – కరణ్ వహిల మధ్య చిత్రీకరించిన ‘బద్నామియాన్’ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.

హాట్ అండ్ సెన్సుయస్ గా చిత్రీకరించబడిన ఈ ఫీల్ గుడ్ సాంగ్ ను ఆర్మాన్ మాలిక్ ఆలపించగా, బామన్ – చాంద్ సంగీతం అందించారు. హాట్ నెస్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘హేట్ స్టోరీ’ సిరీస్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ పాట ఉంది. అయితే ఇంతకుముందు ఇదే సినిమా నుండి విడుదల చేసిన ‘తుమ్ మేరే హో’ రేంజ్ లో హాట్ నెస్ మాత్రం లేదు. ఇహనా ధిల్లాన్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ ఇప్పటికే 14 మిలియన్ క్లిక్స్ అందుకుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories