ప్రేక్షకులను తన సంగీతంతో ఉర్రూతలూగిస్తున్నరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి గొర్తి సత్యమూర్తి గారు ఇటివల అకాల మరణం చెందటంతో దేవి ఇంట్లో విషాద చాయలు అలముకున్నాయి.
తన మొదటి సినిమా నుంచి తానూ సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమా పాటల మొదటి సి.డి ని తన తండ్రికి ఇచ్చే వాడినని, ఇటివల సంగీతం అందించిన ‘నాన్నకు ప్రేమతో’ పాటలు సి.డి ని కూడా తన తండ్రి ఫోటో ముందు వుంచి, ఎప్పుడు లాగా మొదట సి.డి ని తన తండ్రి కి అందిస్తున్నట్టు దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు.
దేవి శ్రీ ప్రసాద్ తండ్రి అకాల మరణం తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతికి రావాటం కష్టం అనుకున్నారు. కానీ తన తండ్రి మరణాన్ని కూడా జీర్ణించుకుని తన ఒక్కడి కోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాత నష్టపోకూడదని పెద్ద మనసుతో దేవి శ్రీ ఈ సినిమాని సంక్రాంత్రికి రెడీ చేసేలా వర్క్ చేసాడు. టాలెంట్ తో పాటు కష్టం మరియు డెడికేషన్ తో పని చేసే మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కి హ్యాట్సాఫ్.





