‘14 రీల్స్’ సంస్థ అధికారికంగా ప్రకటించింది!

Hero nani 14 reels movie title ప్రిన్స్ మహేష్ బాబుతో వరుసగా సినిమాలు నిర్మించి టాలీవుడ్ లో సంచలనాత్మకమైన బ్యానర్ గా పేరు తెచ్చుకున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా నానితో ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. “జై బాలయ్య” వర్కింగ్ టైటిల్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 10వ తేదీన ఆడియోను, ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 5వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్నారని టాక్. “భలే భలే మగాడివోయ్” సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న నాని, ఆ ఊపును కొనసాగించాలంటే, పెద్ద బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా కూడా సక్సెస్ బాట పట్టాల్సిందే!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories