‘డబుల్ హ్యాట్రిక్’ విజయాలతో సక్సెస్ పరంగా అగ్ర హీరోలకు సైతం అందకుండా దూసుకెళ్తున్న ‘నాచురల్ స్టార్’ నాని స్థాయి అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో మరో రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టిన నాని, తాజాగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తోన్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో సెలబ్రిటీగా అలరించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, సోషల్ మీడియాలో ఇది సందడి చేస్తోంది.
‘మెగాస్టార్’ను ఇమిటేట్ చేస్తూ ప్రారంభమైన నాని టైమింగ్ డైలాగ్స్, ‘పెద్దయ్యాక ఏం అవుతావ్ అంటే… చిరంజీవి అవుతానని’ చెప్పడం అంతా సందడి సందడిగా సాగింది. చిన్నపుడు ఏ హీరో సినిమా కోసమైతే లైన్ లో నిల్చుని టికెట్లు కొనుక్కున్నానో, ఇప్పుడు అదే హీరో ముందు ఇలా కూర్చోవడం… ఎలా చెప్పాలో కూడా తనకు తెలియడం లేదని నాని తన అనుభూతులను పంచుకున్నాడు.
తన బాబాయ్ పెద్దయ్యాక ఏమవుతావురా అంటే… చిరంజీవి అవుతా… అంటూ చెప్పిన సందర్భంలోనిది ఈ ఫోటో అంటూ తన మొబైల్ లోని ఓ ఫోటోను చూపిస్తూ చెప్పారు ఈ నాచురల్ స్టార్. ఇంతకీ చిన్నప్పుడు తన బాబాయ్ కు చెప్పినట్లుగా నాని మెగాస్టార్ అయ్యాడా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం లభిస్తుంది. సినీ వారసులు మాత్రమే రాజ్యమేలే ఈ సినీ ఇండస్ట్రీలో నాని ఈ స్థాయికి వచ్చారంటే… అప్పట్లో మెగాస్టార్ రేంజే అనుకోవాలి.
#MegastarChiranjeevi tho Natural Star @NameisNani this week on #MeeloEvaruKoteeswarudu..Sunday at 9 PM #MEKwithMegastar #Vivo pic.twitter.com/61WpuSJchC
— STAR MAA (@StarMaa) April 7, 2017


