సొంత బ్యానర్ స్టార్ట్ చేసిన నాని

Can Nani Give First Post Baahubali 2 Success In The US?హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నారు. గతంలో ఢీ ఫర్ దోపిడి సినిమా కోసం నాని నిర్మాతగా మారినా సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సొంతగా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ లో ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

ప్రశాంత్ చెప్పిన పాయింట్ విపరీతంగా నచ్చటంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోనూ రిలీజ్ చేయనున్నారు.

ADVERTISEMENT

మరోవైపు నాని హీరోగా నటిస్తున్న ఎంసీఏ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. ఇదే కాకుండా కృష్ణార్జున యుద్ధం అనే సినిమా కూడా ఆయన చేతిలో ఉంది. సినిమాల షూటింగ్ల తో నిత్యం నాని బిజీగా ఉండడంతో ఆయన సతీమణి అంజనా సినిమా నిర్మాణం చూసుకుంటుందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories