రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ పార్టీకి ఒక స్పష్టత లేదని, ప్రతి ఎన్నికలకొకసారి రాజధాని పేరును మారుస్తూ వైసీపీ రాజధాని తో రాజకీయం చేస్తుందని, అమరావతి నుంచి మూడు రాజధానులు, మూడు రాజధానుల నుంచి విశాఖ వరకు విశాఖ నుంచి మావిగన్ వరకు ఇలా రాజధాని విషయంలో వైసీపీ అనుసరిస్తున్న నిలకడలేని వైఖరి పై సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అయినా కూడా పార్టీ అధినేతగా జగన్ తగ్గేదెలా అన్నట్టుగా 2029 ఎన్నికలు మావిగన్ vs అమరావతి గా ముందుకెళ్లనున్నాయి అంటూ ప్రకటించిన ఈ తరుణంలో ఏపీలో జరగబోతున్న స్థానిక ఎన్నికలలో రాజధానిగా జగన్
ప్రతిపాదించిన మావిగన్…మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో వైసీపీ జెండా ఎగరేస్తుందా.? అసలు ఆ అవకాశం ఉందా.?
ముందుగా మావిగన్ లోని ‘మచిలీపట్టణం’ గురించి చూస్తే…,
అక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత షేక్ అబ్దుల్ అబీదా బరిలోకి దిగారు. ఇక వైసీపీ తరుపున లంకా జ్యోతి పోటీలో ఉన్నారు. మచిలీపట్నం లో టీడీపీ తరుపున మంత్రి కొల్లురవీంద్ర, జనసేన తరుపున ఎంపీ బాలసౌరి ఉండడం ఆ ప్రాంతంలో కూటమి అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు వైసీపీ తరుపున మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ బాధ్యతలు భుజాన వేసుకోవడంతో ఇక్కడ వైసీపీ గెలుపోటముల ప్రభావం పేర్ని రాజకీయ భవిష్యత్ పై కనిపిస్తుంది.
అలాగే ఇక మావిగన్ లో భాగమైన ‘విజయవాడ’ విషయానికొస్తే…,
ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధ బరిలో నిలవగా వైసీపీ నుంచి కనీసం గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా అభ్యర్థులు ముందుకు రాలేకపోయారు. దీనితో వైసీపీ నాంకేవాసి అన్నట్టుగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని రంగంలోకి దింపారు. ఇక్కడ కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ రాజకీయ బలంతో పాటుగా వంగవీటి బ్రాండ్ కూడా వైసీపీ ఓటమికి ఒక ముఖ్య కారణం కాబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇటు వైసీపీ నేతలు మాత్రం వైసీపీ గెలుపు కోసం కంటే కూటమి ఓటమి కోసమే శ్రమిస్తున్నారు.
ఇక మావిగన్ లో చివరి స్థానంలో ఉన్న ‘గుంటూరు’ సంగతికొస్తే…,
ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కోవెలమూడి లక్ష్మి అపర్ణ నామినేషన్ వేస్తే వైసీపీ నుంచి తాడికొండ శ్రీదేవి రంగప్రవేశం చేసారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సొంత నియోజకవర్గం కావడంతో గుంటూరు మేయరు స్థానంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు కూటమి శ్రేణులు. అయితే వైసీపీ గుంటూరు ఇంచార్జ్ అంబటి రాంబాబు మేము ఇప్పటికి గత సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయాము, మా దగ్గర డబ్బులు లేవు, ఆర్గానిక్ రాజకీయాలు చేస్తాం అంటూ ఫలితాలకు ముందే కాదిది వదిలిసే ప్రకటనలు చేస్తున్నారు.
ఇలా రాజధానిగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ లో ఎక్కడ కూడా వైసీపీ జెండా ఎగిరే పరిస్థితులు లేవనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాలో కూడా తేలింది. మరి ఆయా ప్రాంతాల వైసీపీ ముఖ్య నాయకులు స్థానిక ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అయినా తమ అధినేతను రాజధాని విషయంలో వెనక్కి రప్పిస్తారా.? లేదా జగన్ ను ఇలానే సమర్థిస్తూ తమ రాజకీయ భవిష్యత్ ని బలిపీఠం ఎక్కిస్తారా.? అనేది చూడాలి..!





