హై కోర్టులో మొట్టికాయలు.. ఏపీ ప్రభుత్వానికి కు సర్వసాధారణం అయిపోయింది

High Court of Andhra Pradeshహై కోర్టులో మొట్టికాయలు వేయించుకోవడం ఆంధ్రప్రదేశ్ కు సర్వసాధారణం అయిపోయింది. తాజాగా తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం తేవడంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది.

ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు సుధీష్ రాంభొట్ల, ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని కోర్టు వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT

ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతుంది అనే ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారని సమాచారం. దీని ప్రకారం, ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అయితే కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం లేదు. సిలబస్ ఫైనల్ చెయ్యడం పుస్తకాల ముద్రణ కూడా జరగాల్సి ఉంది. దానికంటే ముందుగా సుప్రీం కోర్టు అనుకూలమైన తీర్పు ఇవ్వాలి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కనీసం వచ్చే ఏడాది వరకైనా వాయిదా పడే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories