స్పీకర్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్షింతలు

High court warns tammineni sitaramఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్షింతలు వేసింది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో కోర్టులు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని, రాజకీయ లం*త్వానికి పాల్పడుతున్నారు అంటూ తమ్మినేని మీడియాలో తీవ్రంగా స్పందించారు. దానిపై కోర్టు సీరియస్ అయ్యింది.

ADVERTISEMENT

బాధ్యతాయుత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హితవుపలికింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హెచ్చరించింది.

ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా నెలకొనలేదని హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా తమ్మినేని తరచు రాజకీయ విమర్శలు చేస్తూ వార్తలలో ఉంటారు. దానివల్ల రాజ్యాంగబద్ధమైన పదవికి కూడా కళంకం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడినా తమ్మినేని తన పంథా మార్చుకోవాలి.

కోర్టుల లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటివరకూ దాదాపుగా 100 కేసులలో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఈ క్రమంలో విమర్శల నుండి తప్పించుకోవడానికి అధికారపార్టీ నేతలు తరచుగా చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో తమ్మినేని కూడా వ్యాఖ్యలు చేసి కోర్టుతో చివాట్లు తిన్నారు.

ADVERTISEMENT
Latest Stories