ఇది రంగస్థలం కాదు, రణస్థలం..!

RCB vs KKR

ఇప్పటికే ఐపీఎల్ మొదలయ్యి వారం రోజులు కాగా, ప్రతి ఏడాది లానే ఈసారి కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచటం లో ఐపీఎల్ ఏ మేరకు తగ్గలేదు. ఐపీఎల్ చరిత్ర లోనే మునుపెన్నడూ అందుకొని స్కోర్ 277 రన్స్ చేసి సన్రైజర్స్ మరియు తిరిగి లక్ష్య ఛేదన లో ముంబై 246 రన్స్ చేసి, మొదటి ఇన్నింగ్స్ మరియు రెండవ ఇన్నింగ్స్ ల లో అత్యధిక స్కోర్ చేసిన మ్యాచ్ గా చరిత్ర సృష్టించింది.అయితే ఈ ఐపీఎల్ 2024 లో నే ఎంతో ఎదురుచూస్తున్న పోరు ‘బెంగళూరు’ మరియు ‘కోల్కతా’ జట్టులు తలబడనున్నాయి.

నేడు ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్టులు బెంగళూరు లో ని చిన్నస్వామి వేదికగా ఒక ఉత్కంఠమైన పోరు కు రంగం సిద్ధమయ్యింది. కేవలం ఈ ఒక్క మ్యాచ్ లో నే ఎన్నో మునుపటి ఘర్షణలు మరళ కలవనున్నాయి. అందులో ఢిల్లీ కు చెందిన అగ్ర క్రికెటర్లు గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ కలయిక ఈ మ్యాచ్ కె హైలైట్ కానుంది. ఈ ఇరువురు ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ వేదికగా పలు సార్లు వాఘ్వాదానికి లోనయ్యారు. కాగా ముగిసిన ఐపీఎల్ 2023 లో కూడా ఈ ఇద్దరు ఒక ఘాటైన పోరు లో మ్యాచ్ ముగిసిన తర్వాత వాదన లో కనపడ్డారు.

ADVERTISEMENT

ఈ ఒక్కటే కాక గత ఏడాది ఐపీఎల్ లో రింకు సింగ్ చేత చివరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టించుకున్న యాష్ దయాల్ ఈసారి తన మునపటి ఫామ్ ను అందుకుని ఆర్సీబీ కి కీలక బౌలర్ గ మారాడు.నేడు మళ్ళీ రింకు,యష్ దయాల్ ఒకే మ్యాచ్ లో తలపడనున్నారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా కీలక పోరు గా పిలవబడే సిరాజ్ మరియు రస్సెల్ పోరు కూడా ఈ మ్యాచ్ లో చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేవు.

అయితే ఇన్ని ఇంటరెస్టింగ్ పోరుల నేపథ్యంలో ఈ మ్యాచ్ రంగస్థలాన్ని కాదు రణస్థలాన్ని తలపించనుంది.నేడు మన ముందుకు రానున్న ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కోసం కేవలం ఆ ఇరు జట్టుల అభిమానులే కాక క్రికెట్ ఫాన్స్ అందరూ ఈ ఆసక్తికరమైన పోరు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.చూడాలి మరి హోమ్ టీం అయిన ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2024 హోంటీంసెంటిమెంట్ ను కొనసాగిస్తుందో లేక ఆ సెంటిమెంట్ ను కేకేఆర్ టీం బద్దలుకొడుతుందా అని.

ADVERTISEMENT
Latest Stories