ఆమె కూతురు కాదు… డేరా బాబా సంచలన సంగతి..!

Honeypreet Singh The Alleged Daughter Of Ram Rahim గుర్మీత్ రాం రహీం సింగ్ వారసురాలిగా సిర్సాలోని డేరా సచ్ఛా సౌదాలో వినిపిస్తున్న పేరు హనీ ప్రీత్ సింగ్ గురించి ఆశ్రమంలో బాడీ గార్డ్ గా పని చేసిన బియాంత్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా పక్కనే నిత్యం కనిపించే హనీ ప్రీత్‌ అతనిని తండ్రిగా పేర్కొంటుంది కానీ, వారిది ఆమోదయోగ్యమైన సంబంధం కాదని, వారిద్దరూ చేసేది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు. వాస్తవానికి ఆమె పేరు ప్రియాంక తనేజా అని, 1999లో ‘సచ్చా డేరా’ ఫాలోవర్‌ విశ్వాస్‌ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకుందని తెలిపారు.

గుర్మీత్ కు నమ్మకమైన భక్తుడు కావడంతో విశ్వాస్ గుప్తా మరియు ఆయన భార్య ప్రియాంక అలియాస్ హనీ ప్రీత్, ఎప్పుడంటే అప్పుడు ఆశ్రమానికి వచ్చే వెసులుబాటు ఉండేదని, గార్డులు కూడా వారిని ఆపేవారు కాదని వివరించారు. అయితే ఒక రోజు విశ్వాస్ ఆశ్రమానికి వచ్చేసరికి… ఆయన భార్య గుర్మీత్ బెడ్‌ రూమ్‌ లో, ఆయనతో అభ్యంతరకర స్థితిలో కనిపించింది (ఈ విషయం స్వయంగా విశ్వాస్‌ గుప్తానే గతంలో మీడియాకు తెలియజేశారు). దీంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి, మీడియా ముందు బాబా గుట్టు రట్టు చేశారు.

ADVERTISEMENT

అయితే తన అత్తమామలు కట్నం కోసం తనను వేధిస్తున్నారని హనీప్రీత్ కేసు పెట్టించారని, ఆ తరువాత తన పలుకుబడితో వారిపై మరిన్ని కేసులు పెట్టి, మానసికంగా వారిని హింసించారని, తరువాత భరణం పేరుతో వారి ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారని బియాంత్ సింగ్ తెలిపారు. ఇప్పుడు హనీ ప్రిత్ సింగ్ గా మారి, గుర్మీత్ దత్త పుత్రికగా సిర్సాలో ప్రధాన భాగమని అన్నారు. జైల్లో కూడా ఆమె తనతో ఉండాలని బాబా కోరారని గుర్తు చేశారు. కాగా, డేరా సచ్చా సౌధాలో కీలకమైన ఆమెకు ట్విట్టర్‌ లో పది లక్షల మంది, ఫేస్‌ బుక్‌ లో ఐదు లక్షల మంది, ఇన్‌ స్టాగ్రామ్‌ లో 1,88,000 మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఆమె సొంతగా ఒక వెబ్ సైట్ ను కూడా నిర్వహిస్తోంది. ఈ వెబ్ సైట్ లో గుర్మీత్ ను దైవం, రాజులకు రాజు అంటూ కీర్తిస్తుంది. గుర్మీత్ తీసిన ‘ఎంఎస్‌జీ ది వారియర్‌, లైన్‌ హార్ట్‌’ సిరీస్‌ సినిమాల దర్శకత్వ బాధ్యతలతో పాటు నటన బాధ్యతలు కూడా హనీ ప్రీత్ తీసుకుంది. ఈ సినిమాల్లో 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్ లో వేసుకుంది. అంతే కాకుండా తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్‌ ఎడిటర్‌ నని, రచయితనని, అన్నింటికన్నా గుర్మీత్ సింగ్‌ కు గొప్ప కూతురునని చెప్పుకుంటోంది. ఇలా వారిద్దరి సంబంధం గురించి చెప్పిన బాడీ గార్డ్ బియాంత్, డేరా బాబాకు మరిన్ని విషయాలు కూడా వెల్లడించాడు.

సిర్సాలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రాం రహీం సింగ్ అకృత్యాలు కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాలేదని, ఇక్కడ 600 మంది పురుషులు శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుండగా, కొన్ని వేల మంది తాత్కాలిక ప్రాతిపదికన, మరింత మంది అదనంగా స్వచ్చందంగా షిఫ్టులవారీగా పనిచేస్తారని చెప్పారు. అయితే శాశ్వత ఉద్యోగుల్లో దాదాపుగా 250 నుంచి 300 మందిని నపుంసకులుగా, శృంగారానికి పనికి రాని వారిగా గుర్మీత్ మార్చేశారన్న సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరికి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా చేయగా, మరికొంత మందికి వృషణాలను తొలగించారని తెలిపారు.

ఇక్కడితో ఆగని డేరా, హత్యలు, భూకబ్జాలకు కూడా పాల్పడ్డాడని, ఏదైనా భూమి మీద అతని కన్ను పడితే, వెంటనే తన గూండాలను ఆ స్థలం పైకి పంపేవాడని, అక్కడ వారు మలమూత్ర విసర్జన చేసేవారని అన్నారు. అలా చేసిన తరువాత ఆ భూమిని దాని యజమాని ఎట్టి పరిస్థితుల్లో బాబాకే విక్రయించాలని, అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉండేదని, పోనీ ఆ భూమికైనా సరైన ధర కట్టేవాడా? అంటే అది కూడా జరిగేది కాదని, 20 లక్షల రూపాయల విలువైన భూమికి కేవలం ఒకటి లేదా రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టేవాడని గుర్మీత్ అక్రమాల గురించి వెల్లడించాడు.

ADVERTISEMENT
Latest Stories