హైదరాబాద్ ను భుజానకెత్తుకున్న నేరచరితులు!

GHMC hyderabad in criminals handపార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు… మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తున్న అభ్యర్థులకూ నేర చరిత్ర వున్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో కొందరిపై క్రిమినల్ కేసులున్నట్లు తేలింది.

150 సీట్లకుగాను పోటీ చేస్తున్న అభ్యర్ధులలో సగానికి సగం మంది అంటే 72 మంది వివిధ కేసుల్లో బుక్కైన వారే వున్నారు. ఈ జాబితాలో 8 మంది మహిళలు కూడా ఉండడం విశేషం. టీఆర్ఎస్-14, టీడీపీ-13, కాంగ్రెస్-13, ఎంఐఎం-11, బీజేపీ-4, ఎంబీటీ-2, సీపీఐ-1, సీపీఎం-1, బీఎస్పీ-1, ఎస్పీ-1 ఇండిపెండెట్స్ 11 మంది మీద వివిధ కేసులు నమోదైనట్టు ఈ సంస్థ వెల్లడించింది. మరి వీరే భావితరం హైదరాబాద్ ను తమ భుజానకెత్తుకుని మోస్తామని హామీలు గుప్పిస్తున్నది. ఓటర్లూ గమనిస్తున్నారా..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories