స్పా అంటే మసాజ్… మసాజ్ అంటే…

Hyderabad Spa Raids

హైదరాబాద్‌లో ‘స్పా’లకు కరువు లేదు. స్పా పేరుతో పురుషులకు, స్త్రీలకు కూడా ‘మసాజ్’ కూడా చేసేస్తున్నారు కొందరు.

పురుషులతో పురుషులకు మసాజ్ చేయాలంటే ఒక రేటు. అదే అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయాలంటే దానికి రెట్టింపు లేదా మూడింతలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకూ స్త్రీలతో మసాజ్, పురుషులతో కూడా మసాజ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.

ADVERTISEMENT

కొందరు మసాజ్ కోసమే రావచ్చు. కానీ అందరూ మసాజ్ కోసమే రారు. మసాజ్ వరకు వచ్చేక ఎవరూ మడి కట్టుకొని కూర్చోరు.

కనుక మసాజ్‌తో మొదలుపెట్టి సెక్స్ వరకు అన్ని సేవలు సదరు ‘స్పా’లలో లభిస్తున్నాయి. ఈ స్పెషల్ సర్వీసుల కోసం కొన్ని స్పాలలో రహస్య గదులు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ అకస్మాత్తుగా పోలీసులు రైడ్ చేసినా నిరాటంకంగా సేవలు చేయించుకోవచ్చని భరోసా ఇస్తున్నారు కొందరు.

హోటల్లోనో, బజారులోనో ఇలాంటి పనులు చేస్తే వ్యభిచారం అంటారు. కానీ ఇక్కడ ‘స్పా’ అనే చక్కటి పేరు పెట్టుకొని అన్ని రకాల సేవలు అందించేస్తున్నారు.

పోలీసుల భయంలేని ఇంత సౌకర్యవంతమైన ‘స్పా’లలో ఇలాంటి సేవలు లభిస్తుంటే వాటికి ఆదరణ, డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. కనుక ఒక్క మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోనే ఏకంగా 113 ‘స్పా’లు రేయింబవళ్ళు సేవలు అందిస్తున్నాయి.

కనుక ఓసారి వాటి పని తీరు చూద్దామని పోలీసులు తనికీలు నిర్వహిస్తే ఈ భాగోతాలన్నీ బయటపడ్డాయి. ఒకే ఒక్క రైడ్‌లో పోలీసులు ఏకంగా 46 కేసులు నమోదు చేశారంటే స్పా సేవలు ఎంత జోరుగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

నగర శివారులో ఫామ్‌హౌసులలో జరిగే రేవ్ పార్టీలలో అర్ధనగ్నంగా డాన్సులు చేసేందుకు యూపీ, బిహార్ నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నప్పుడు, బ్యూటీ పార్లర్ పేరుతో తీసుకురావడంలో వింతేమి ఉంది?

ఇకపై ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే అందరినీ జైలుకి పంపిస్తామని పోలీసులు స్పా యజమానులను హెచ్చరించారు. కానీ డిమాండ్-సప్లైని బ్యాలన్స్ చేయకుండా ఊరుకుంటారా?

ADVERTISEMENT
Latest Stories