ys-jagan-lies

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 2 నెలలవుతోంది. కానీ టిడిపి కంటే వైసీపి గురించే రోజూ ఏదో చెప్పుకోవలసి వస్తోంది. జగన్‌ ప్యాలస్‌లో నుంచి అడుగు బయటపెట్టకుండానే రోజూ మీడియా, సోషల్ మీడియా ఫోకస్‌ తనపై ఉండేలా చేసుకోగలుగుతున్నారు.

Also Read – వినాయక మంటపాలతో కూడా రాజకీయాలా… యాక్!

కానీ అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి పార్టీలు ఈవిషయంలో వెనకబడిపోయాయని చెప్పక తప్పదు. అందువల్లే జగన్‌ నిత్యం వార్తలలో కనిపిస్తున్నారని అనుకోవవచ్చు.

వైసీపి తాజాగా ట్విట్టర్‌లో ఓ వీడియో పెట్టింది. దానిలో జగన్‌ మాట్లాడుతూ, “అబద్దాలు చెప్పి ఆ కిరీటం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకి సంతృప్తిగా ఉండగలమా? ఏవో అబద్దాలు చెప్పి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాము.

Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్‌… నో వర్రీస్ మేము రెడీ

కానీ మన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మద్యకు వెళితే జగన్‌ అబద్దాలు చెప్పి, మమ్మల్ని మోసం చేశాడని ప్రజలు అడగకుండా ఉంటారా?జగన్‌ అంటే విశ్వసనీయత. మాట ఇస్తే తప్పడని మా నేతలు, కార్యకర్తలు గర్వంగా కాలర్ ఎగరేసుకొని ప్రజల మద్యకు వెళ్ళాలి తప్ప నా వలన వారు ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదు. దాని కోసమే నేను తాపత్రయపడ్డాను,” అని అన్నారు.

జగన్‌ మళ్ళీ విలువలు, విశ్వసనీయత పాట ఎందుకు మొదలుపెట్టారో అర్దమవుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌ ఆరోపిస్తూనే ఉన్నారు. కనుక ఆయన కంటే తాను చాలా నిజాయితీ పరుడినని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు.

Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!

ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, మద్యపాన నిషేధం, ప్రభుత్వోద్యోగులకు సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలండర్‌ వంటి అనేక విషయాలలో జగన్‌ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. అవన్నీ సరిపోవన్నట్లు లక్షల కోట్ల అప్పులు, భూకబ్జాలు, మాఫియాలు అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్ధిక, సామాజిక, వ్యవస్థలను విధ్వంసం చేశారు. ప్రజల చేత ఛీ కొట్టించుకొని అధికారం కోల్పోయారు.

అయినా జగన్‌ ఇంత ధైర్యంగా విలువలు, విశ్వసనీయత అంటూ నీతులు వల్లెవేస్తూ, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారంటే, జగన్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదనుకోవాలి.

లేదా తాను ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్ముతారనే గుడ్డి భ్రమలో ఉన్నారని అనుకోవాలి. లేదా ఇదివరకు పాదయాత్రలో నీతి, నిజాయితీ అంటూ కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగలిగాము కనుక మళ్ళీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారని అనుకోవలసి ఉంటుంది.




కానీ జగన్‌ ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టకుండానే టిడిపి కూటమి ప్రభుత్వం మీద ఇంతగా బురద జల్లుతుంటే, టిడిపి, జనసేన, బీజేపీ నేతలు నిమ్మకు నీరేత్తిన్నట్లు చూస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్‌ దుష్ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంలో అలసత్వం ప్రదర్శిస్తే, జగన్‌ మళ్ళీ ప్రజల రక్షకుడి అవతారంలో టిడిపిని దెబ్బతీయడం ఖాయం.