పవన్ రాజకీయాల్లోకి వెళితే చిరునే ఇక..!

Dil Raju about mahesh babu janaganamanaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కనీసం ఒక్క సినిమానైనా నిర్మించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన అభిప్రాయాన్ని చాలా సందర్భాలలో వ్యక్తపరిచారు. పలు ఆడియో వేడుకల మీద అయితే పరోక్షంగా పవన్ కు విజ్ఞప్తులు చేసారు కూడా! అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాల బాట పడుతుండడంతో, ఇక ఆయనతో సినిమా చేస్తారా… లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఇదే ప్రశ్న దిల్ రాజు గారిని అడిగితే… పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అదృష్టం ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనని, అయితే ఎలాగైనా చేస్తాననే నమ్మకం ఉందని, ఒకవేళ పవన్ రాజకీయాల్లోకి వెళితే చిరంజీవి గారితో సినిమా చేస్తానా అన్నది చెప్పలేమని, సినిమాల విషయంలో ఏదీ ముందుగా అంచనా వేసినట్లు జరగదని, సినిమా అంటేనే ఒక మ్యాజిక్ అని… మధ్యలో ఏ మార్పులైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు ఈ సక్సెస్ ఫుల్ నిర్మాత.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories