నేను ‘ఆ టైప్’ కాదన్న టాప్ హీరోయిన్!

Ileana Dcruz On Movie Chances in Film Industryసినిమాల్లో అవకాశాలు రావడం అంత ఈజీ కాదని ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ గోడు వెలిబుచ్చుతున్న విషయాలతో అర్ధమవుతోంది. ఇండస్ట్రీలో ఛాన్స్ లు అందిపుచ్చుకునే క్రమంలో కొంతమంది దిగజారుతారు అనే టాక్ కూడా ఉంది. అయితే తాను మాత్రం ఆ టైప్ కాదని అంటోంది గోవా బ్యూటీ ఇలియానా. అవకాశాల కోసం తాను దిగజారి బతకనని, ఛాన్సులు ఇవ్వాలని కోరుతూ తాను ఎవరి వెంటా పడనని, అందుకే తనకు సినిమాలు తగ్గాయని చెప్పింది.

అంతేకాదు ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని ఇల్లీ చెప్పుకొచ్చింది. ఇతర హీరోయిన్లు, తన కన్నా ఎక్కువ వయసున్న భామలు కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే… ఇలియానాకు మాత్రం ఏడాదికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతోంది. మరో వైపు, తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయిన విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలియానా ఇలాంటి కబుర్లు చెబుతోందంటూ సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories