అక్టోబర్ 19న ఆస్ట్రేలియా-భారత్ వన్-డే సిరీస్ మొదలయిన విషయం తెల్సిందే. అయితే నేటితో ఈ సిరీస్ లో 2 మ్యాచ్లు ముగవగా రెండిట్లోనూ భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చూపటంలో విఫలమయింది.
సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, కొత్త కెప్టెన్ శుబ్మాన్ గిల్ ఇద్దరూ రెండు మ్యాచ్లలోను చేతులెత్తేశారు. అయితే దీనికి ప్రధానమైన కారణం గా బీసీసీఐ మరియు జట్టు కోచింగ్ స్టాఫ్ నే నిందిస్తున్నారందరు.
ఒక 3-4 నెలల మునుపు కనీసం ఒక్క ఫార్మటు కి కూడా సారధి గా వ్యవహరించని గిల్ కు ఏకంగా రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలందించారు. రెండు ఫార్మాట్లను మ్యానేజ్ చేయటంలో గిల్ విఫలమవుతున్నట్లు క్రికెట్ అభిమానుల ఒపీనియన్.
అందులోను భారత జట్టు చివరిగా వన్-డే ఫార్మటు లో ఆడిన సిరీస్ అన్నింట్లోనూ విజయం సాధించి, అటు వన్-డే వరల్డ్ కప్ ’23 మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీలలో కూడా రోహిత్ శర్మ నేతృత్వంలో అత్యద్భుత ప్రదర్శన చూపినప్పటికీ, కేవలం వయసు అనే పారామీటర్ ను ఉద్దేశించి రోహిత్ నుండి కెప్టెన్సీ పగ్గాలను గిల్ కు అందించారు.
ఇటు విరాట్ కోహ్లీ చూసుకున్నా, గతంలో టీం ఇండియా కు తాను చేసిన సేవ మరువలేనిది. కానీ, వీటికేమాత్రం విలువ కట్టకుండా, ఈ సిరీస్ లో బాగా ప్రదర్శిస్తేనే జట్టులో కొనసాగుతారు, లేదంటే లేదు అని అంటుంటే, అంతటి ఒక ఆటగాడ్ని ఒక్క సిరీస్ ఫెయిల్యూర్ ఏకంగా తనను రిటైర్మెంట్ కు నెట్టేస్తుందా..? అనే ప్రశ్నలు రాకపోలేవు.
విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్ల అవసరం ఇప్పుడు జట్టుకు తప్పనిసరి. జట్టు మొత్తం యువకులతో నిందుతున్న ఈ సమయంలో ఆ ఉడుకు రక్తానికి అనుభవం తోడయితే మనసులో మండే నిప్పు సరియన విధంలో మండుతుంది.
యువకులతో జట్టు నిండాలనేది తప్పు వాక్యం కాదు గాని, దేశ జట్టు కోసం గత 10-15 ఏళ్లగా మరువలేని సేవలు చేసిన విరాట్ మరియు రోహిత్ ను కేవలం వారి వయసు విషయమై జట్టు నుండి తొలగించి, ఆ చోటును కూడా యువకులతో నింపాలి అనే బీసీసీఐ అత్యుత్సాహం ఇప్పటికే సిరీస్ ను ముంచేసింది.
మరి రానున్న కాలంలోనైనా గిల్ అంచనాలను అందుకుని జట్టును సరైన మార్గంలో నడిపించగలదా అని..?




