సుదర్శన్, గగన్ యాన్…. ఒకేసారి రెండు ప్రయోగాలు!

Sudarshan Gaganyaan Launch

ఇటీవల భారత్‌-పాక్ మద్య మూడు రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు గగనతల రక్షణ వ్యవస్థ ఎంత అవసరమో సామాన్య ప్రజలకు సైతం అర్దమైంది.

ఆ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ దాడులను సమర్ధంగా అడ్డుకోగలిగాము. ఆ తర్వాత మరిన్ని ‘ఎస్-400’ల కోసం రష్యాకు మళ్ళీ ఆర్డర్ పెట్టింది. కానీ అత్యవసరంగా కావాల్సివస్తే… సమయానికి అందకుంటే పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే ఇటువంటి ఆయుధాలు, వ్యవస్థల కోసం ఇతర దేశాలపై ఆధార పడటం దేశ భద్రతని పణంగా పెట్టడమే అని అర్ధమవుతుంది.

ADVERTISEMENT

అందుకే ప్రధాని మోడీ ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘సుదర్శన్’ గగనతల రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఆగస్ట్ 15న ప్రధాని మోడీ ‘సుదర్శన్’ గురించి చెప్పగా ఆగస్ట్ 23న అంటే వారం రోజుల వ్యవధిలోనే డీఆర్‌డీవో అటువంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థని విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశాలోని క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి శనివారం అర్ధరాత్రి ఈ అత్యాధునిక ‘ఐఏడిడబ్ల్యూఎస్’ గగనతల రక్షణ వ్యవస్థని విజయవంతంగా పరీక్షించామని డీఆర్‌డీవో తెలియజేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గగనతల రక్షణ వ్యవస్థ తయారు చేసుకోగలిగిందన్న మాట!

సరిగ్గా ఇదే సమయంలో ఇస్రో కూడా ‘గగన్ యాన్’ ప్రయోగంలో ఓ ముందడుగు వేసింది. గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి మనుషులను పంపి తిరిగి వారిని క్షేమంగా భూమికి తీసుకువచ్చేందుకు ఉపయోగించే క్యాప్‌సూల్ ఐఏడిటి-101ని విజయవంతంగా పరీక్షించింది.

శ్రీహరికోట వద్ద సముద్ర తీరంలో ఇస్రో, డీఆర్‌డీవో, ఇండియన్ నేవీ కలిసి జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించాయి.

ఐఏడిటి-101ని ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌకలో సముద్రంలోకి తీసుకువెళ్ళి హెలికాఫ్టర్‌ ద్వారా ఆకాశం నుంచి కిందకు జారవిడిచారు. మూడు ప్యారచూట్లు సాయంతో అది సురక్షితంగా సముద్రంపై దిగింది.

ఇదివరకు రెండు మూడుసార్లు ఈ ప్రయోగం చేసినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని గుర్తించి సరిచేసి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది.

ఇస్రో ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలు చాలా చేసింది. కనుక ఈసారి ముందుగా మనవ రహిత రాకెట్ ద్వారా ఈ ఐఏడిటి-101ని అంతరిక్షంలోకి పంపించి అక్కడి నుంచి సురక్షితంగా భూమికి తీసుకురాబోతోంది. ఆ ప్రయోగం కూడా విజయవంతం అయితే ఇక ఇస్రో కూడా నాసాతో అంతరిక్షయాత్రలకు పోటీ పడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories